‘డియర్ కామ్రేడ్’ రివ్యూ!

First Published Jul 26, 2019, 2:21 PM IST

టైటిల్ లో కమ్యూనిజం, పోస్టర్స్ లో  రొమాంటిజం , ట్రైలర్ లో పోరాట నేపధ్యం...ఇలా విభిన్న ఎలిమెంట్స్ ని పరిచయం చేస్తూ మన ముందుకు వచ్చిన చిత్రం‘డియర్ కామ్రేడ్’.

---(Review By సూర్య ప్రకాష్ జోశ్యుల) టైటిల్ లో కమ్యూనిజం, పోస్టర్స్ లో రొమాంటిజం , ట్రైలర్ లో పోరాట నేపధ్యం...ఇలా విభిన్న ఎలిమెంట్స్ ని పరిచయం చేస్తూ మన ముందుకు వచ్చిన చిత్రం‘డియర్ కామ్రేడ్’.మెసేజ్ ని మెస్మరేజ్ చేసే లవ్ స్టోరీ తో చెప్పారని చెప్తున్న ఈ సినిమా నిజంగానే ఆ పనిచేసిందా. వరస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా మరో గీతా గోవిందం అవుతుందా.. ఓ కొత్త దర్శకుడుతో చేయాలనిపించేంత ఉత్సాహం తెప్పించిన ఆ కథేంటి..ఇంతకీ ఈ సినిమా పైన చెప్పుకున్న ఎలిమెంట్స్ లో వేటికి పూర్తి న్యాయం చేసింది...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
undefined
కథేంటి : చైతన్య అలియాస్ బాబీ (విజయ్‌ దేవరకొండ) తాత ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ .దాంతో ఈ మనవడుకి ఆ లక్షణాలు వచ్చాయని ఇంట్లో వాళ్లు నమ్ముతూంటారు. ఆ సంగతేమో కానీ ...కాస్త కోపం జాస్తి. గొడవలకు కాలు దువ్వే బాబి...వాడితోనే కాకినాడ కాలేజ్ లో స్టూడెంట్ లీడర్ అవుతాడు.ఇతని క్రేజ్ గమనించి లోకల్ పొలీషియన్స్ అతన్ని వాడుకుందామని చూస్తే ఒప్పుకోడు. దాంతో వాళ్లకీ ఇతనంటే మంట. ఇదిలా ఉంటే అతనికి ప్రక్కింట్లో వచ్చి చేరిన అపర్ణా దేవీ అలియాస్‌ లిల్లీ (రష్మిక మందన్న) తో పరిచయం అవుతుంది. దాన్ని ప్రేమగా మార్చే పనిలో ఉంటాడు బాబి. అయితే స్టేట్‌ లెవల్‌ క్రికెట్ ప్లేయర్ అయిన అపర్ణ...తాను అలాంటి వాటికి మొదట దూరం అని చెప్పుతుంది. కానీ కాల క్రమేణా అతని ప్రేమలో తీవ్రత చూసి దగ్గరవుతుంది‌. అయితే ఆ తర్వాత ప్రేమ తీవ్రత కన్నా...అతనిలో ఆవేశం పాలు ఎక్కువని, ఆ తీవ్రత తట్టుకోవటం అర్దం చేసుకుని బ్రేక్ అప్ చెప్పి దూరం అయిపోతుంది.దాంతో అతను ప్రేమ పిచ్చివాడైపోతాడు. దాని నుంచి తేరుకోవటానికి ఫ్యామిలీకు దూరమై ట్రావలింగ్ లో కాలక్షేపం చేస్తూంటాడు. వైల్డ్ లైఫ్ సౌండ్స్ మీద రీసెర్చ్ మొదలెడతాడు. ఆ ప్రాజెక్టులో భాగంగా మళ్లీ హైదరాబాద్ వస్తాడు. అక్కడ ఓ హాస్పటిల్ లో షాకింగ్ గా లిల్లీ డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఆమె మానసిక పరిస్దితి దారుణంగా ఉంటుంది. స్టేట్ లెవిల్ క్రికెట్ ప్లేయర్ అయిన ఆమె..క్రికెట్ కు బై చెప్పేస్తుంది. హఠాత్తుగా ఆమె అలా మారిపోయింది. అసలు ఆమె జీవితంలో ఏం జరిగింది. ఇలాంటి పరిస్దితుల్లో బాబీ ఏం చేసి, తన మాజీ గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకున్నాడు. చివరకు వాళ్లలా ఒకటయ్యారు అనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.
undefined
కథ,కథనం : ఈ సినిమా చూస్తూంటే వచ్చే ఫస్ట్ డౌట్...ఈ రోజుల్లో కాలేజే లలో ఇంకా శివ సినిమా టైప్ లో స్టూడెంట్స్ తగువులాడుకోవటం, స్ట్రైక్ లు, లోకల్ పొలిటీషన్స్ స్టూడెంట్స్ చేరదీయటం వంటివి ఉన్నాయా అని. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ స్టూడెంట్స్ కెరీర్ ఓరియెంటేషన్ లో ప్రెవేట్ కాలేజీల్లో చదువుకుంటున్నారు. అక్కడ అలాంటివి కుదరవు. గవర్నమెంట్ కాలేజీల్లో గొడవలు చేసుకునేటంత మంది స్టూడెంట్స్ ఉండరు. (ఒకటీ అరా ఎప్పుడూ మినహాయింపు ఉంటుంది)
undefined
కథ కన్నా కథనం మీద ఎక్కువ కాన్సర్టేట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఆ విషయంలో మనని ఇబ్బంది పెడుతుంది. ఎంతకీ తరగని ఓ ప్రవాహంలా వెళ్తూనే ఉంటుంది. ప్రారంభం నుంచి ఓ లవ్ స్టోరీలా వెళ్తూ...సెకండాఫ్ సగం అయ్యేసరికి వేరే టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ఆ దిశగా ప్రయాణం పెట్టుకుంటుంది. దాంతో అప్పటిదాకా ఉన్న లవ్ ఫీల్ కాస్తా మెసేజ్ మసాజ్ తో మాయం అయిపోతుంది.అలాగని ఇదేమన్నా కొత్త కథా అంటే బోలెడన్ని సార్లు తెలుగు సినిమాల్లో టచ్ చేసిందీ. ఇక కథలో అసలైన కాంప్లిక్ట్ పాయింట్ (హీరోయిన్ ప్లాష్ బ్యాక్ ) వచ్చేసరికి సినిమా సగం అయ్యిపోతుంది. అంటే అప్పటిదాకా కథలో అప్పటికప్పుడు ఏ సీన్ కా ఆ సీన్ కాంప్లిక్స్ రాసుకుంటూ పోయారు కానీ..కథని మొత్తం లీడ్ చేసేది మాత్రం చూసుకోలేదు. దాన్ని చివరి దాకా దాచిపెట్టారు.
undefined
ఇవి చాలదన్నట్లు సీన్స్ సాగతీసినట్లు ఉండటం...సినిమా లెంగ్త్ ఇబ్బంది పెడతాయి. ఇరవై నిముషాలు పైగా ఎడిట్ చేసేసినా ఇబ్బంది లేదనిపిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ లాంటి హీరో ఉన్నప్పుడు సమస్యను తాను సాల్వ్ చేయాలికానీ, ఎదుటివాళ్లు సాల్వ్ చేసుకునే దిసగా ప్రేరేపిస్తూ కూర్చూంటే విసుగొస్తుంది. ఇక కథనం అంతా చాలా ప్రెడిక్టుబుల్ గా సాగేదే.
undefined
ప్రత్యేకంగా చెప్పేదేముంది.. : విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాటిట్యూడ్‌ ,హీరోయిన్ రష్మికా తో కెమిస్ట్రీ అన్నీ ఇరగతీసాడు. ఆవేశపరుడైన చైత‌న్య అలియాస్ బాబీ పాత్రలో జీవించాడు. కానీ కథే అతనికి కలిసిరాలేదు. రష్మిక కూడా సేమ్ టు సేమ్. విజయ్ తో పోటీ పడి చేసింది. లవ్ సీన్స్ లోనూ, ఎమోషనల్ సీన్స్ లోనూ రష్మిక ఎక్సప్రెషన్స్ న్యాచురల్ గా ఉన్నాయి. హీరో ప్రెండ్స్ గా చేసిన వాళ్లు సైతం మంచి ప్రతిభను కనపరిచారు.
undefined
దర్శకుడు పనితనం : ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన భరత్ కమ్మ స్టోరీ లైన్ మంచిదే తీసుకున్నా, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఎట్రాక్ట్ చేసే విధంగా స్క్రీన్ ప్లే తో కూడిన ట్రీట్మెంట్ రాసుకోలేదనిపిస్తుంది. పోయిటిక్‌ స్టైల్‌ నేరేషన్‌,మేకింగ్ కొందరికి ఖచ్చితంగా నచ్చుతాయి. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్‌ ట్రాక్‌ చాలా బాగా డీల్ చేసారు. ముఖ్యంగా సినిమాని రియలిస్టిక్ ఎప్రోచ్ తో నడిపారు. ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ నుంచి మంచి అవుట్ ఫుట్ తీసుకున్నారు.
undefined
టెక్నికల్ గా : జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.అలాగే సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌.కాశ్మీర్ ఎపోసోడ్ తో పాటు కేరళ అందాలతో తెరకెక్కించిన విజువల్స్‌ బాగున్నాయి. ఎడిటర్‌ మొహమాటపడి ఉండకుండా ఉండాల్సింది. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
undefined
ఫైనల్ థాట్ : విజయ దేవరకొండ అప్పుడే మెసేజ్ సినిమాలు మొదలెట్టేస్తే ఎలా
undefined
Rating: 2.55
undefined
click me!