ఫొటోలు:బీరాభిషేకం.. విజయ్ దేవరకొండకే

First Published Jan 19, 2021, 11:46 AM IST

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. రమ్యకృష్ణ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి ‘లైగర్‌’ అన్న టైటిల్‌ను ఖరారు చేస్తూ సోమవారం చిత్ర టీమ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఫ్యాన్స్ పోస్ట‌ర్‌తో పండుగ‌లా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు.  వినైల్ పోస్టర్స్ ను కూడళ్ళ లో పెట్టి దానికి పాలాభిషేకం చేసిన వారు కొందరైతే, ఆ పోస్టర్ ముందు కేక్ కట్ చేసి... సంబరాలు జరుపుకున్న వాళ్ళు మరికొందరు. కొంద‌రు అభిమానులు పాలాభాషేకాల‌కు బ‌దులు బీరాభిషేకాలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు ఫొటోలతో చూడండి..

లైగర్‌ అంటే.. పులి, సింహం కలయిక వల్ల పుట్టే కొత్త బ్రీడ్‌. అందుకే టైటిల్‌కు తగ్గట్లుగానే పోస్టర్‌లో ‘సాలా క్రాస్‌బ్రీడ్‌’ అనే ఉపశీర్షికను జత చేశారు.
undefined
మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రధానఅంశంగా రూపొందుతున్న చిత్రమిది. ముంబయి నేపథ్యంలో సాగుతుంది. ఇప్పటికే 40శాతానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కాబోతుంది.
undefined
ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ సోమవారం విడుద‌ల చేయ‌గా, ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంది. దీంతో ఫ్యాన్స్ పోస్ట‌ర్‌తో పండుగ‌లా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ఇంకొంద‌రు కేక్‌లు క‌ట్ చేశారు.
undefined
మ‌రి కొంద‌రు చేతుల‌పై లైగ‌ర్ ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నారు. చిన్నారులు లైగ‌ర్ పోస్ట‌ర్‌కు చాక్లెట్ తినిపిస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చారు.
undefined
బాణాసంచా కాల్చ‌డం, స్వీట్స్ పంచుకోవ‌డం ఇలా ఒక‌టేంటి ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు లైగ‌ర్ పోస్ట‌ర్ రిలీజ్ వేడుకను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు.
undefined
సినిమా విడుదల సమయంలో థియేటర్ల దగ్గర బాణసంచా కాల్చి, డప్పులతో హంగామా సృష్టించినట్టే... 'లైగర్' ఫస్ట్ లుక్ పోస్టర్ ముందూ కొందరు కుర్రాళ్ళు తీన్ మార్ స్టెప్పులూ వేశారు.
undefined
ఇప్పుడే ఇంత సందడి చేస్తున్న అభిమానులు మరి రేపు రిలీజ్ టైమ్ లో ఇంకెంతగా జోరును ప్రదర్శిస్తారో చూడాలంటున్నారు సినీ అభిమానులు.
undefined
విశేషం ఏమంటే... రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ అభిమానులు ఈ పోస్టర్ ముందు సంబరాలు చేసుకుంటున్నారు!
undefined
ఈ పోస్టర్ లో పొడవాటి హెయిర్‌ స్టెల్‌తో బాక్సింగ్‌ పంచ్‌ విసురుతూ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు విజయ్‌ దేవరకొండ.
undefined
బ్యాక్‌గ్రౌండ్‌ పోస్టర్‌లో సింహం, పులి కలబోసిన రూపం దర్శనమిస్తోంది. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌ పాత్రలో కనిపించబోతున్నారు.
undefined
‘పాన్‌ఇండియా ‘లైగర్‌' ప్రాజెక్ట్‌ను గౌరవంగా ప్రకటిస్తున్నాం. నేషన్‌వైడ్‌ మ్యాడ్‌నెస్‌ గ్యారంటీ’ అంటూ విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌లో ప్రకటించారు.
undefined
రమ్యకృష్ణ, రోనిత్‌రాయ్‌, విష్ణురెడ్డి, అలీ, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఆర్ట్‌: జాకీ షేక్‌బాషా, ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
undefined
మొదట ఈ టైటిల్ గురించి గూగుల్ లో తెగ వెతికారు అభిమానులు. ఫైటర్ విన్నాం..టైగర్ విన్నాం కానీ లైగర్ ఏంటి చిత్రంగా అంటూ అడుగుతున్నారు. దీనికి అర్థం ఉంది. సాధారణంగా క్రాస్ బ్రీడ్ ను లైగర్ అంటారు. అందుకే ట్యాగ్ లైన్ కూడా ఇదే పెట్టాడు పూరీ జగన్నాథ్.
undefined
లైగర్ అనే పదానికి డిక్షనరిలో ఉన్న అర్థమేంటంటే... మగ సింహం, ఆడ పులికి పుట్టిన సంతానాన్ని లైగర్ అంటారు. లయన్‌లోని ల అనే పదాన్ని.. టైగర్‌లోని చివరి రెండు అక్షరాలను తీసుకుని లైగర్ అంటారు.
undefined
ఇది అర్దం అవ్వాలనే 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.
undefined
వరస ఫ్లాపులతో ఉన్న విజయ్ కు ఈ చిత్ర విజయం కీలకంగా మారింది. ఉత్తరాది భామ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది.
undefined
లైగర్ సినిమాతోనే బాలీవుడ్‌లో పూర్తి స్థాయిలో అడుగు పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. పాన్ ఇండియన్ స్థాయిలో వస్తున్న లైగర్ సినిమాను హిందీలో కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.
undefined
click me!