ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ వెంకీమామ.. నయా ఫోటోస్‌ ట్రెండింగ్‌

First Published Dec 12, 2020, 6:24 PM IST

వినోదాత్మక చిత్రాలకు, రీమేక్‌ మూవీస్‌లకు కేరాఫ్‌గా నిలిచారు విక్టరీ వెంకటేష్‌. రీమేక్‌లతో హిట్లు కొట్టి `విక్టరీ`ని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. రేపటి(ఆదివారం)తో ఆయన 60వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పంచుకున్న కొత్త ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 
 

వెంకటేష్‌ తండ్రి రామానాయుడు అప్పట్లో పెద్ద నిర్మాత అన్న విషయం తెలిసిందే. అనేక మంది స్టార్‌ హీరోలతో, అనేక భాషల్లో సినిమాలు నిర్మించి హిట్‌ కొట్టారు.
undefined
`కళియుగ పాండవులు` సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన వెంకటేష్‌..హీరోగా కావాలని ఎప్పుడూ అనుకోలేదు. సినీ ఎంట్రీ చాలా యాదృచ్చికంగా జరిగింది. ఓ హీరోతో ఆ సినిమా చేయాలనుకున్నారు నిర్మాత రామానాయుడు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు. కానీ ఆయన హ్యాండివ్వడంతో విదేశాల్లో చదువుకుంటున్న వెంకటేష్‌ని ఇండియాకి రప్పించి, అప్పటికప్పుడు యాక్టింగ్‌ స్కిల్స్ పై అవగాహన కల్పించి హీరోని చేశారు.
undefined
తొలి సినిమాతోనే నటుడిగా మెప్పించాడు. అయితే ఆయన బాలనటుడిగా `ప్రేమ నగర్‌` చిత్రంలో మెరిశాడు. అలాగే హీరోగా నటించిన తొలి చిత్రం `కళియుగ పాండవులు`తో నంది అవార్డుని అందుకున్నాడు.
undefined
మ్యూజికల్‌ రొమాంటిక్‌ చిత్రం `ప్రేమ`, `స్వర్ణకమలం`, `బొబ్బిలిరాజా`, `క్షణం క్షణం` చిత్రాల్లో నటించారు. కెరీర్‌ ప్రారంభంలోనే భారీ విజయాలను అందుకుని అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగారు. ఆయన నటించిన `స్వర్ణకమలం` జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సందడి చేసింది. దీనికి కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించడం విశేషం. `చంటి`, `ధర్మ చక్రం`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `గణేష్‌, `ప్రేమించుకుందాం రా`, `రాజా`, `నువ్వు నాకు నచ్చావ్‌`, `మల్లీశ్వరి, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `తులసి` వంటి చిత్రాలతో సూపర్‌ హిట్స్ అందుకున్నాడు. తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు.
undefined
`చంటి`, `ధర్మ చక్రం`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `గణేష్‌, `ప్రేమించుకుందాం రా`, `రాజా`, `నువ్వు నాకు నచ్చావ్‌`, `మల్లీశ్వరి, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `తులసి` వంటి చిత్రాలతో సూపర్‌ హిట్స్ అందుకున్నాడు. తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు.
undefined
వెంకీ రీమేక్‌ చిత్రాలతో విజయాలు అందుకోవడమే కాదు, నయా మల్టీస్టారర్‌ చిత్రాలకు తెరలేపాడు. ఆయన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `మసాలా`, `గోపాల గోపాల`, `ఎఫ్‌2`, `వెంకీమామ` చిత్రాలు చేశాడు. విజయాలను అందుకున్నాడు.
undefined
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు వెంకీ పెట్టింది పేరు. ఆయన సినిమాలన్నీ మంచి ఫ్యామిలీతో కూర్చొని చూసేలా ఉంటాయి. వినోదానికి పెద్ద పీఠ వేస్తాడు. వెంకీ కామెడీ కింద ఏ కమెడీయన్‌ కూడా పనికిరాడంటే అతిశయోక్తి కాదు. వెంకీ చాలా యాక్షన్‌ చిత్రాలు చేసినా, ఆయనపై ఫ్యామిలీ హీరో అని, ఎంటర్‌టైనింగ్‌ హీరో అనే ముద్రే పడింది. ఆడియెన్స్ కూడా వెంకీ సినిమా అంటే వినోదానికి కొదవలేదనేలానే చూస్తుంటారు.
undefined
ఇప్పటికీ ఓ వైపు మల్టీస్టారర్‌, మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `అసురన్‌` రీమేక్‌లో నటిస్తున్నాడు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకీ కాస్త పెద్ద వయస్కుడిగా కనిపించబోతున్నారు. అందు కోసం గెడ్డం పెంచాడు. మాసిన గెడ్డంలో కనువిందు చేయనున్నాడు.
undefined
తాజాగా వైట్‌ గెడ్డం లుక్‌లో ఫోటో షూట్‌ నిర్వహించాడు. ఆయన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. వెంకీ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.
undefined
click me!