Guppedantha Manasu: రిషీ నా వాడు.. దేవయానికి అల్టిమేట్ షాకిచ్చిన వసుధార!

First Published Oct 27, 2022, 10:25 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ఇంటి బయట రిషి, వసుధారులు సోఫాలో కూర్చుని ఉంటారు. అదే సమయంలో రిషికి మినిస్టర్ గారి పీఏ ఫోన్ చేస్తాడు. రిషి ఫోన్ ఎత్తిన తర్వాత అతను మాట్లాడుతూ, మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ కోసం అందరికీ మెయిల్ పంపాము కదా సర్ అందులో జగతి, మహేంద్ర సార్లు మీటింగ్ కి రాలేమని పోస్ట్ ఫోన్ చేయమని చెప్పారు. మినిస్టర్ సార్ అభిప్రాయం ప్రకారం మీటింగ్ కి అందరూ వస్తే మంచిది కదా అందుకే మీకు ఒక మాట చెప్పమన్నారు అని అన్నారు. దానికి రిషి సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి,  చూశావా వసుధార వాళ్ళు నా మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు. 

కానీ మినిస్టర్ గారికి రిప్లై ఇచ్చారు అంటే నేను మరీ అంత కానీ వాడిని అయిపోయానా! ఇప్పుడు మీటింగ్ కి వస్తే నా మొఖం చూడాలి అనే కదా వాళ్ళు రావడం లేదు నేను అంతా ముఖం చూపించలేని తప్పు ఏం చేశాను వసుధార అని అంటాడు. అప్పుడు వసుధార, మీరు అలా నిరాశ పడొద్దు సార్ జగతి మేడం, మహేంద్ర సార్లు మనకు దొరుకుతారు అని అంటుంది. అప్పుడు రిషి తన తలను వసుధార భుజం మీద పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో పైనుంచి దేవయాని వాళ్ళిద్దర్నీ అంత దగ్గరగా చూసి ఆశ్చర్య పోతుంది. 
 

అప్పుడు వసుధార రిషితో, మీరు బాధపడొద్దు సార్ మీరు ఇలా ఉంటే నేను చూడలేను బయట చలిగా ఉంది లోపలికి వెళ్దాం పదండి అని అంటుంది. దానికి రిషి, నువ్వు లోపలికి వెళ్ళు వసుధార నేను ఇక్కడే ఉంటాను డాడ్ నాతో ఇక్కడే చాలా సమయం గడిపే వాళ్ళు అని అనగా అయితే త్వరగా వచ్చేయండి అని చెప్పి వసు వెళ్ళిపోతుంది. వసుధార నువ్వు లేకపోతే నేను ఏమైపోయే వాడిని అని రిషి మనసులో అనుకుంటాడు. వసు లోపలికి వస్తున్నప్పుడు దేవయాని వసుధార చేయు గట్టిగా పట్టుకుంటుంది.
 

 ఏం చేస్తున్నారు మేడం అని వసు అనగా, నువ్వేం చేస్తున్నావ్ వసుధార రిషితో అంత చనువుగా ఎందుకు ఉంటున్నావు పరాయి మగాడితో అలా ఉండొచ్చా అని అనగా, రిషి సార్ ఏం పరాయి మగాడు కాదు మేడం నేను ప్రేమించిన వ్యక్తి అని అంటుంది వసు. మీ ఇద్దరికీ పెళ్లి అయిందా పరాయి మగాడు కాకపోవడానికి అయినా ఈ మధ్య పెత్తనాలు బాగా చాలా చేస్తున్నావు మాటకి మాట సమాధానం ఇస్తున్నావు. నా స్థానంలో ఇంకెవరైనా ఉంటే నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేసేవారు అని అంటుంది. అప్పుడు వసు, నన్ను మాట్లాడనివ్వండి మేడం.

 మీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే రిషి సార్ మనసు అర్థం చేసుకొని వెళ్లి ఓదార్చేవారు. రిషి సార్ ఎదురుగుండా జగతి మేడం గురించి మహేంద్ర సార్ గురించి అన్ని మాటలు అంటున్నారు కదా మీరు ఇంకో విషయం గుర్తుంచుకోండి మీరు ఏమి అన్నా పడడానికి నేను ధరణి మేడమ్ నీ కాదు ఒక అప్పటి జగతి మేడంని కాదు వసుధార ని మాటకి మాట తిరిగి సమాధానం చెప్తాను. మీరు భయపడితే భయపడడానికి చిన్నపిల్లను కాదు మీ పెత్తనాలు నా మీద చలాయించోద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవయాని మనసులో, ఇంక లాభం లేదు దీనికి నా నిజస్వరూపం చూపించాలి అని అనుకుంటుంది.
 

 ఆ తర్వాత సీన్లో రిషి తన గదిలో కూర్చుని మహేంద్ర తో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు. అదే సమయంలో వసూ గదిలో కూర్చుని రిషి సార్ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు పడుకుని ఉంటారా ఇంత బాధ మధ్యలో ఏం పడుకుంటారులే వెళ్లి చూద్దామా అని తన తలుపు ని పట్టుకుని ఉంటుంది. అదే సమయంలో రిషి, వసుదార దగ్గరికి వచ్చి వసుధార పడుకొని ఉంటుందా లేక నా గురించి ఆలోచించుకుంటూ ఉంటుందా ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు వసు తలుపుతీస్తుంది.

 రిషి వెళ్లిపోవడం చూసిన వసదార, సార్ ఇక్కడ వరకు వచ్చారు కానీ నా దగ్గరికి రాలేదు పాపం బాధపడుతున్నట్టున్నారు అని అనుకుంటుంది. అప్పుడు రిషి అలా గౌతమ్ గదిలోకి వెళ్తాడు. గౌతమ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, అమ్మ నేను తింటున్నాను ఈ మధ్య కొంచెం లావు కూడా అయ్యాను. నేను ఇండియాలోనే ఉన్నాను కదా నువ్వు బాధపడొద్దు అని అంటాడు. రిషి వచ్చిన వెంటనే తర్వాత చేస్తాను అమ్మ అని ఫోన్ పెట్టేస్తాడు.  అప్పుడు రిషి గౌతమ్ గదిలో కూర్చుంటాడు. ఏమైందిరా అని గౌతమ్ అడగగా, అమ్మ మాటలు వినాలని ఉన్నదిరా.
 

 అమ్మ ఏమంటుంది అని అనగా,  జరిగిన విషయం అంత గౌతమ్ చెప్తాడు. నాకు ఎప్పుడు ఇలాంటివి జరగలేదు రా ఎవరు నాతో ఇలా మాట్లాడలేదు డాడ్ ఒకలే నాతో ఎంతో ప్రేమగా ఉండేవారు. ఎప్పుడైనా రాత్రులు లేటుగా వస్తే దుప్పటి తీసుకెళ్లావా కప్పుకున్నావా అని చాలా జాగ్రత్తగా మాట్లాడే వారు. ఇప్పుడు డాడ్ నా దగ్గర నుంచి దూరం అయిపోయారు నేను ఏం తప్పు చేశాను రా అని ఏడుస్తూ ఉంటాడు రిషి. దానికి గౌతమ్ మనసులో, అన్ని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది అని అనుకుంటూ బాధపడొద్దు రా వాళ్ళు ఎప్పటికైనా నీ దగ్గరికి వస్తారు.

 మీ వాళ్ళు కూడా నీ గురించే బాధపడుతూ ఉంటారు కదా అని అనగా అలా బాధపడే వాళ్లే అయితే మరి వెళ్ళిపోవడం ఎందుకురా అని అంటారు. వాళ్ళు కావాలని వెళ్ళి ఉండరు రా వాళ్ళు ఏదో కార్యం మీద వెళ్ళుంటారు అని అనగా ఏంట్రా నువ్వు అని తెలిసినట్టు మాట్లాడుతున్నావు అయినా నా పరిస్థితి చూస్తున్నావు కదరా నేను ఇక్కడ ఇలాగా అల్లాడిపోతున్నాను నాకు డాడ్ ఎలాగైనా కావాలి. ఇంత జరిగిన తర్వాత తప్పు నాదేనేమో అనిపిస్తుంది అని రిషి చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ గోడ బయట నుంచి వసుధార విని బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

click me!