పవన్ కళ్యాణ్ తో జబర్దస్త్ కమెడియన్స్ కోట్ల రూపాయల డీల్... ఈ హడావుడి అందుకేనా, గెటప్ కామెంట్స్ తో క్లారిటీ

Published : May 06, 2024, 07:19 AM ISTUpdated : May 06, 2024, 11:36 AM IST

పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ భారీగా ఛార్జ్ చేశారట. అభిమానంతో కాదు డబ్బుల కోసం వారంతా పిఠాపురంలో దిగారట. దీనిపై షాకింగ్ విషయాలు బయటపెట్టాడు గెటప్ శ్రీను...   

PREV
17
పవన్ కళ్యాణ్ తో జబర్దస్త్ కమెడియన్స్ కోట్ల రూపాయల డీల్... ఈ హడావుడి అందుకేనా, గెటప్ కామెంట్స్ తో క్లారిటీ

2019 సార్వత్రిక ఎన్నికలు పవన్ కళ్యాణ్ కి తీరని వేదన మిగిల్చాయి. ఆ పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు. 

27

ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న పిఠాపురంలో పోటీ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాడు. 

 

37
Get up Srinu

కాగా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని మొత్తం జబర్దస్త్ టీమ్ దిగిపోయారు. హైపర్ ఆది షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి ఏకంగా ఒక నెల పవన్ కళ్యాణ్ తరపున ప్రచారానికి పూనుకున్నాడు. పిఠాపురంలో హైపర్ ఆది మకాం వేశాడు. అలాగే గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవ వంటి కమెడియన్స్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. 

47
Get up Srinu

అయితే జబర్దస్త్ కమెడియన్స్ పిఠాపురంలో డబ్బులు తీసుకుని ప్రచారం చేస్తున్నారట. ఈవెంట్స్, ఎపిసోడ్స్ కి పేమెంట్ తీసుకున్నట్లు.. ఎన్నికల ప్రచారానికి కూడా వారు పెద్ద మొత్తంలో ఛార్జ్ చేస్తున్నారట. దాదాపు రూ. 2 కోట్లు వాళ్లకు చెల్లించినట్లు జనసేన పార్టీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

57
Get up Srinu


ఈ ఆరోపణల మీద గెటప్ శ్రీను స్పందించారు. రాజు యాదవ్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న గెటప్ శ్రీను... డబ్బులు తీసుకుని పిఠాపురంలో ప్రచారం చేస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు, నిజాయితీ పరుడు. ఆయన గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ప్రచారం చేస్తున్నాము. మీకు సందేహం ఉంటే మా బ్యాంకు అకౌంట్స్ వివరాలు ఇస్తాము. చెక్ చేసుకోండని అన్నారు. 
 

67
Get up Srinu

ఇక ఏళ్ల తరబడి జబర్దస్త్ షోలో జడ్జిగా చేసిన రోజా సైతం కొన్ని కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ఆధిపత్యం ఉంది. జబర్దస్త్ కమెడియన్స్ వి చిన్న ప్రాణాలు. మెగా ఫ్యామిలీకి భయపడే వాళ్ళు ప్రచారం చేస్తున్నారని రోజా అన్నారు. 
 

77
Get up Srinu

ఈ కామెంట్స్ పై స్పందించిన గెటప్ శ్రీను... రోజా కామెంట్స్ ని చిన్న కామెంట్స్ గా తీసుకుంటాను. నేను మెగా హీరోలతోనే కాదు ఎన్టీఆర్, వెంకటేష్, నాని వంటి ఇతర హీరోలతో కూడా చేశానని గెటప్ శ్రీను అన్నారు. భయపడో, ఆఫర్స్ కోసమో పిఠాపురంలో ప్రచారం చేయలేదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు...

Read more Photos on
click me!

Recommended Stories