Guppedantha Manasu: రిషి,వసుల మధ్య మొదలైన కొత్త ప్రేమ కథ.. జగతికి సారీ చెప్పిన రిషి?

First Published Mar 29, 2023, 7:40 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో రిషి ఒకప్పటి రిషి లాగే స్టైల్ గా రెడీ అయ్యి వస్తాడు. అప్పుడు ధరణి దగ్గరికి వెళ్లి వదిన అనగా అప్పుడు ధరణి చిన్న అత్తయ్య చిన్న మామయ్య వసుధార ముగ్గురు కలిసి ఒకే కారులో వెళ్లారు అనగా వారి ముఖకవళికలు ఎలా ఉన్నాయి వదిన అనగా నేను కిచెన్ లో ఉండి పని చేసుకుంటున్నాను కానీ వాళ్ళ వాయిస్ వినిపించింది కానీ వాళ్ళ ఫేసెస్ నేను చూడలేదు రిషి అని అంటుంది ధరణి. సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత జగతి, మహేంద్ర, వసుధార కార్లో వెళ్తుండగా ఇప్పుడే మొదలైంది అని రిషి మెసేజ్ చేయగా అవును సార్ అని రిప్లై ఇస్తుంది వసు.
 

అప్పుడు జగతి వసుధార వైపు చూస్తూ ఏంటి వసు ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తోంది రిషి కారులో వెళ్లకుండా మా కారులో వస్తోంది కారణం అడిగితే చెప్పడం లేదు మళ్లీ ఏమైనా గొడవ పడ్డారా అనుకుంటూ ఉంటుంది. తర్వాత వసుధార ఒక లెటర్ పట్టుకుని రిషి కోసం ఎదురు చూస్తుండగా రిషి రావడంతో ఐ యామ్ వసు సార్ జాయిన్ అవ్వడానికి వచ్చాను అనడంతో అయితే ఏంటి కాలేజీలో ఎంతోమంది జాయిన్ అవ్వాలి అనుకుంటారు అందరికీ అవి జరగవు కదా అని అంటాడు రిషి. అప్పుడు మొదట్లో వసుధార ని చూసి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారు అదేవిధంగా ఎవరికీ ఎవరు ఏమీ కానట్టు ఎవరికీ పరిచయం లేదంటే ప్రవర్తిస్తూ ఉంటారు.

అప్పుడు రిషి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సర్ నన్ను జగతి మేడం పంపించింది ఒక్కసారి ఈ లెటర్ చదవండి అనడంతో రిషి కోపంతో ఆ లెటర్ చింపేసి ఇంకొకసారి ఆవిడ గారి పేరు నా దగ్గర తీసుకురాకు అని వసుధార మీద సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జగతి ఎదురుపడడంతో ఇంతకుముందు జగతి అనే పేరు వింటే నాకు నచ్చేది కాదు ఇప్పుడు గౌరవం పెరిగింది ఆమె అంటే డాడీకి ప్రాణం తప్పు ఇలా ప్రవర్తించకూడదు అని రిషి మనసులో అనుకొని జగతికి స్వారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమైంది రిషికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది జగతి. అప్పుడు జగతి, వసుధార దగ్గరికి వెళ్లి రిషి నాకు ఎందుకు స్వారీ చెప్పాడు?

నువ్వు ఎందుకు ఇలా ఉన్నావ్? అసలు మీరిద్దరి ఎందుకు ఇలా ఉన్నారు. మా కార్ లో నువ్వు ఎందుకు వచ్చావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను మేడం అనడంతో సమాధానం ఉంటుంది కదా అది చెప్పు అనగా కానీ నేను ఇప్పుడు చెప్పలేను మేడం అని అంటుంది. అప్పుడు వసుధార, జగతికీ అర్థం కాకుండా ఏదో మాట్లాడుతూ ఉండగా జగతి అయోమయంలో పడుతుంది. ఆ తర్వాత జగతి ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మహేంద్ర అక్కడికి వచ్చి ఏంటి జగతి ఇలాగే ఉన్నావు మీటింగ్ కి టైం అవుతుంది వెళ్దాం పద అని అంటాడు. ఏమైంది జగతి అనగా రిషి వసుధార లో ఏదో కొత్తగా మార్పు కనిపిస్తోంది ఇద్దరు కొత్తగా ప్రవర్తిస్తున్నారు.

ఎప్పుడు రిషి కార్ లో వచ్చే వసు ఈరోజు మన కారులో వచ్చింది. వారిద్దరి మధ్య దూరం పెరుగుతుందేమో అని భయంగా ఉంది మహేంద్ర అంటుంది జగతి. మార్నింగ్ నాకు రిషి కాలేజ్ కి వచ్చిన తర్వాత కారణం ఏంటో తెలియదు కానీ సారీ చెప్పాడు మహేంద్ర అనడంతో ఎందుకు అని అంటాడు మహేంద్ర. అదే విషయం గురించి వసుధారని అడిగితే మీరేం టెన్షన్ పడకండి మేడం అంతా మన మంచికే అని చెప్పేసి వెళ్లిపోయింది అనగా ఆ భరోసా ఇచ్చింది కదా జగతి ధైర్యంగా ఉండు అంటాడు మహేంద్ర. నాకెందుకో మనిద్దరం వాళ్ళని పట్టించుకోలేదు ఏమో అనిపిస్తుంది మహేంద్ర అనగా మనం చేయాల్సినవి చేస్తున్నాం వాళ్లు సంతోషంగానే ఉంటున్నారు కదా జగతి అంటాడు మహేంద్ర.
 

మీటింగ్ కి వెళ్ళాం పద జగతి టైం అవుతుంది. అక్కడ వాళ్ళిద్దరినీ గమనిద్దాం ఏదైనా కొత్తగా ప్రవర్తన ఉంటే తెలిసిపోతుంది కదా అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేయడంతో అప్పుడు రిషి వసుధర ఇద్దరు ఒకరికొకరు సంబంధం లేదు అన్నట్టుగా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉండడంతో జగతి, మహేంద్ర అసలు ఏం జరుగుతుంది మహేంద్ర ఏంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. చూడు జగతి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అన్నావ్.. వాళ్లు చూడు ఎప్పటిలాగే ఒకే మాదిరిగానే ఉన్నారు అనడంతో నాకు అంత అయోమయంగా ఉంది మహేంద్ర ఉంటుంది జగతి. 

ఉదయం అలాగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా ఫ్రెండ్లి గా ఎలా మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది జగతి. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని సీరియస్ గా తీసుకోకూడదు అని చెప్పాను జగతి అంటాడు మహేంద్ర. ఆ తర్వాత మీటింగ్ అయిపోవడంతో రిషి గ్రౌండ్ లోకి వెళ్ళి గేమ్స్ ఆడుతూ ఉండగా ఇందులోని అక్కడికి వసుధార వస్తుంది. ఏంటి ఇక్కడికి వచ్చావు అని రిషి అడగగా చూడ్డానికి వచ్చాను సార్ అనడంతో గేమ్ రాదా అనగానే నేర్పిస్తారా సార్ అనడంతో ఆసక్తి ఉంటే నేర్పిస్తాను అని అంటాడు రిషి. అప్పుడు వసుధార రిషి ఇద్దరు గేమ్ ఆడుతూ ఉండగా మధ్య మధ్యలో పడిపోతూ ఉండగా ఒకరినొకరు పట్టుకుంటూ ఒకరు వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. 
 

జాగ్రత్త పడిపోతావు అనగా మీరు ఉన్నారు కదా సార్ అనడంతో అన్నివేళలా నేను ఉండను జీవితంలో అయినా గేమ్ లో అయినా అని అంటాడు రిషి. ఆ తరువాత వసు,రిషి వెళ్ళి ఒకచోట కూర్చుంటారు.. అప్పుడు వసుధార రిషికి చెమట తుడుస్తుండగా వద్దు. మనం ఈ టైంకి ఇంకా ప్రేమించుకోలేదు అనగా అప్పుడు ప్రేమించుకోలేదేమో ఇప్పుడు ఇద్దరి మనసులో ప్రేమ ఉంది కదా సార్ అంటుంది. మనం ఇక్కడ ప్రేమించుకోలేదు గతంలోనే ప్రేమించుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్లావే చూసుకుందాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన రిషి వసుధార గది దగ్గరికి వెళ్ళగా లేకపోవడంతో ఎక్కడికి వెళ్లింది అనుకుంటూ ఉంటాడు. మరోవైపు జగతి మహేంద్ర రిషి వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

click me!