వారి ప్రేమే ఆశీర్వాదమంటోన్న `వకీల్‌సాబ్‌` భామ అంజలి.. బర్త్ డే ఫోటోలు

First Published Jun 18, 2021, 2:09 PM IST

`వకీల్‌సాబ్‌`తో తెలుగులో మరోసారి వెలిగిన అంజలి బర్త్ డే జరుపుకుంది. తాజాగా ఆమె ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. వారి ప్రేమే ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పింది. 

తెలుగు హీరోయిన్‌ అయినప్పటికీ తెలుగు, తమిళ చిత్రాలతో కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. తెలుగులో కంటే తమిళంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపుని, పేరుని సంపాదించుకుంది. మంచి అవకాశాలను రాబట్టుకుంది.
undefined
అంజలి రెండు రోజుల క్రితం(జూన్‌ 16)న తన 35వ బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంది. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే చాలా సింపుల్‌గా బర్త్ డే వేడుకలను పూర్తి చేసుకుంది అంజలి.
undefined
`వకీల్‌సాబ్‌` తో హిట్‌ అందుకున్న ఈ భామ ఇప్పుడు ఫుల్‌ జోష్‌లో ఉంది. కానీ ఆ జోష్‌ని బర్త్ డే రూపంలో పంచుకోవాలని భావించినా కరోనా మహమ్మారి ఇంటికే పరిమితం చేసింది.
undefined
సింపుల్‌గా కేక్‌ కట్‌ చేసి తన బర్త్ డేని జరుపుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. వారికి ధన్యవాదాలు తెలిపింది.
undefined
మీ ప్రేమ తనకు పెద్ద ఆశీర్వాదమని తెలిపింది. ఈ సందర్భంగా తనకు విషెస్‌ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. మీ సందేశాలు, విషెస్‌లో నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వెల్లడించింది అంజలి.
undefined
పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీగా నటించిన `వకీల్‌సాబ్‌` ఏప్రిల్‌లో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలితోపాటు అనన్య నాగళ్ల, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషించారు.
undefined
ఇక తెలుగులో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో తెలుగులో పాపులర్‌ అయ్యింది అంజలి. ఇందులో సీత పాత్రలో తెలుగు ఆడియెన్సి మెస్మరైజ్‌ చేసిన విషయం తెలిసిందే.
undefined
ఆ తర్వాత `బలుపు`, `గీతాంజలి` వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది.
undefined
ప్రస్తుతం తెలుగులో `ఆనంద భైరవి`, `ఎఫ్‌3`లో నటిస్తుంది. అలాగే తమిళంలో ఓ సినిమా, కన్నడలో మరో సినిమా చేస్తుంది.
undefined
click me!