30 లక్షల బడ్జెట్.. 12 కోట్లు కలెక్ట్ చేసిన ఉదయ్ కిరణ్ సినిమా ఏదో తెలుసా..?

First Published Jun 23, 2024, 12:39 PM IST

ఉదయ్ కిరణ్ ను మర్చిపోదామనుకున్నా మర్చిపోలేరు తెలుగు ఆడియన్స్. పక్కింటి కుర్రాడిమాదిరి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు ఉదయ్ కిరణ్. అంతే కాదు తన సినిమాల ద్వారా రికార్డ్ లు కూడా క్రియేట్ చేశాడు యంగ్ హీరో 

చాలా చిన్న వయస్సులో.. ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉన్న టైమ్ లో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ మరణించి 10 ఏళ్ళు అవుతున్నా.. తెలుగు ఆడియన్స్ మాత్రం ఉదయ్ ని ఎప్పటికీ మర్చిపోలేదు. టీవీలో ఆయన సినిమా వచ్చినప్పుడల్లా..మనస్సులో ఏదో చిన్న బాధ.. ఇలా చేశావేంటయ్య అని పెద్దలు కూడా అనుకుంటారు. 

ఎన్టీఆర్, బన్నీ ఓకే.. రామ్ చరణ్ పై మాత్రం కోపంలో ఉన్న ఫ్యాన్స్..? నోరు విప్పాలంటూ మెగా హీరోపై ప్రెజర్..?

అంతలా తెలుగువారి మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. టాలీవుడ్ లో హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఆయన.. ఆతరువాత వరుసగా ఫెయిల్యూర్స్ కూడా చూశాడు. లవర్ బాయ్ గా.. అమ్మాయి మనసుల్లో రాజకుమారిడిగా.. లేడీ ఫ్యాన్స్ ను ఎక్కువగా సంపాధించిన ఉదయ్ కిరణ్ సినిమాల విషయంలో రేర్ రికార్డ్స్ ను కూడా సాధించాడు. 

వందల కోట్లకు వారసురాలు.. తనకంటే చిన్నవాడితో ప్రభాస్ హీరోయిన్ ప్రేమాయణం..?

teja, chitram

 ఇక ఉదయ్ కిరణ్ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన మొదటి సినిమా చిత్రం. ఈసినిమా తోనే తిరుగులేని రికార్డులు కొల్లగొట్టాడు ఉదయ్. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఉషాకిరణ్ మూవీస్ లో రామోజీరావు నిర్మించారు.  2000 సంవత్సరంలో రిలీజైన చిత్రం..  హైయెస్ట్ గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచింది.  భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. 

ప్రభాస్ రిలీజ్ సెంటిమెంట్.. సీక్రెట్ ప్లేస్ కు యంగ్ రెబల్ స్టార్..? ఎక్కడో తెలుసా..?

ఒక్క సినిమాతోనే ఉదయ్ కిరణ్ కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కాని ఉదయ్ కిరణ్ మాత్రం తనను మొదటి సినిమాతోనే నిలబెట్టిన తేజాతోనే రెండో సినిమా కూడా చేశారు. అదే నువ్వు నేను. ఇక చిత్రం సినిమా తో ఉదయ్ కిరణ్ రేర్ రికార్డ్ ను కొల్ల గోట్టాడు. రీమా సేన్ తో కెమిస్ట్రీ బాగా వర్కైట్ అవ్వడం.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించడంతో.. మూవీ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. 

నేను హాట్ కేక్ లా దొరికాను..? బీచ్ లో బట్టలిప్పాలా..? నా మీదపడి ఏడుస్తున్నారు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

కాగా తొలి సినిమాతోనే ఉదయ్ కిరణ్ సంచలన రికార్డులు సృష్టించాడు. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.30 లక్షలు మాత్రమే కాగా..  ప్రమోషన్‌లు, పబ్లిసిటీలకోసం మరో  10 లక్షల వరకు ఖర్చయ్యాయట. ఇక లాభం మాత్రం కళ్ళు చెదిరేలా వచ్చిందట. అన్నీ కలుపుకుని మొత్తంగా 42 కోట్ల బిజినెస్‌తో.. థియేటర్ లో రిలీజ్ అయిన చిత్రం సినిమా .. రిలీజ్ అయిన ప్రతీ చోట.. హౌజ్ ఫుల్ బోర్డులతో రచ్చ చేసింది. ఫైనల్ రన్ లో అద్భుతం చేసింది..అక్షరాలా 12 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిర్మాత రామోజీరావు కు పట్టలేని సంతోషాన్ని ఇచ్చింది. అయితే అప్పట్లో ఈ సినిమా కోసం ఉదయ్ కిరణ్ 11000 రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడట. 

ఇక ఎన్ని అవకాశాలు వచ్చినా.. ఉదయ్ కిరణ్ మళ్లీ తేజ దర్శకత్వంలోనే  నువ్వు నేను సినిమా చేశాడు. ఈ సినిమా కూడా అద్భత విజయం సొంతంచేసుకుంది. రెండో సినిమాకే ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆయనకు ఫ్యాన్ బేస్ లు కూడా స్టార్ట్ అయ్యాయి. 
 

అయితే ఉదయ్ కిరణ్ ఖాతాలో మరో రికార్డ్ కూడా ఉంది. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టిన హీరోగా ఉదయ్ కిరణ్ ఖాతాలో సరికొత్త రికార్డ్ పడింది. అటు అల్లు అర్జున్ కూడా ఇదే రికార్డ్ ను సాధించారు. చిత్రం, నువ్వు నేను తరువాత అదే ఏడాది వీ.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే సినిమా చేశాడు ఉదయ్ కిరణ్. ఇక ఈసినిమా టాలీవుడ్  బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది. 

తొలి మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కావడంతో.. ఉదయ్ కిరణ్ టైర్ 1 హీరోల లిస్ట్ లోకి చేరతాడు అని అంతా అనుకున్నారు. మెగాస్టార్ రేంజ్ వస్తుందని కూడా ఊహించారు. కాని ఉదయ్ కిరణ్ వరుస ప్లాప్ లు అందుకోవడంతో.. ఆయన గ్రాఫ్ తగ్గింది. ఆతరువాత కొన్నిసమస్యల కారణంగా.. మానసికంగా ఇబ్బందిపడి యంగ్ హీరో..  సూసైడ్ చేసుకుని.. అందరిని విడిచి వెళ్ళిపోయారు. 
 

Latest Videos

click me!