Intinti Gruhalakshmi: తులసిని నానా మాటలు అన్న అభి.. అభికి బుద్ధి చెప్పిన నందు?

First Published Feb 7, 2023, 8:59 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో తులసి మీ నాన్న దొంగతనం చేసో లేకుంటే ఎవరినో మోసం చేసే డబ్బు సంపాదించడం లేదు ఆ విషయం మీ ఫ్రెండ్స్ కి చెప్పు అని అంటుంది. కష్టపడి సంపాదించే వాడు ఎప్పుడూ తల దించుకొని ఉండడు తల ఎత్తుకొని తిరుగుతాడు ఈ విషయం కూడా మీ ఫ్రెండ్స్ కి చెప్పు అని అంటుంది. కాకమ్మ హోటల్ పెట్టుకున్న వాళ్ల ట్రీట్మెంట్ కి వస్తే ట్రీట్మెంట్ చేయవా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటావు కదా వాళ్ళ డబ్బులు కావాలి కానీ వాళ్ళు నచ్చరా అంటూ తులసి అభికి తగిన విధంగా బుద్ధి చెబుతుంది. ఇప్పుడు శృతి కరెక్ట్ గా మాట్లాడారు ఆంటీ అనడంతో వెంటనే లాస్య వాళ్లు మాట్లాడుతున్నాను కదా మధ్యలో నీకేంటి నాకు మాట్లాడడం చేతకాక కాదు అంటూ శృతిపై సెటైర్స్ వేస్తుంది.
 

చూడు మామ్ నువ్వు చెప్పే ప్రవచనాలు అన్ని సినిమాలో చెప్పట్టు కొట్టడానికి బాగుంటాయి గాని రియల్ లైఫ్ లో బాగుండవు. పరువు ప్రెస్టేజ్ ఇవన్నీ నీకు తెలియదు ఎందుకంటే నువ్వు చదువుకోలేదు కదా అని అంటాడు. అప్పుడు పరందామయ్య సీరియస్ అవుతూ ఒరేయ్ నువ్వు డాక్టర్ చదువు మాత్రమే చదివావు మీ అమ్మ జీవితాన్ని చదివింది అని అంటాడు. మీ అమ్మ లాగా గొప్పగా ఎదగడం జీవితాంతం తపస్సు చేసిన నీ వల్ల కాదురా పిల్ల కాకి అని అంటాడు. మీ అమ్మ కనబట్టి నువ్వు ఈరోజు భూమి మీద ఉన్నావు. మీ అమ్మ తన కడుపు మాడ్చుకొని నీకు పెట్టబట్టే ఈరోజు చదివావు అలాంటిది మీ అమ్మని వేలు ఎత్తి చుపిస్తావా అని అంటాడు. మామ్ ని ఏదైనా అంతే చాలు అందరు కట్టకట్టుకుని నామీద విరుచుకుపడుతున్నారు.
 

నేను అనేదాంట్లో మంచో చెడ్డ ఉందో ఆలోచించరా అనడంతో ఉంటే కదరా ఆలోచించడానికి అంటుంది అనసూయ. మీ నాన్న కాకమ్మ హోటల్ పెడతాడు. మీ అమ్మ చదువుకోలేదు అని నువ్వు అనుకుంటే ఇప్పటికిప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపో ఎవరు అడ్డుపడరు అని అంటాడు పరంధామయ్య. ఇంట్లో ఉండాలన్న తాపత్రయం కానీ ప్రేమ కానీ నాకు లేదు ఎప్పటినుంచో వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని అంటాడు. మీ అమ్మ మీరందరూ కలిసి ఉండాలని అనుకుంటుంది అనడంతో విడాకులు తీసుకొని విడిపోతే తప్పులేదు కానీ ఉమ్మడి కుటుంబం విడిపోతే తప్పేంటి నానమ్మ అంటాడు అభి.

మీ అందరిని చూసి నా భార్య కూడా అలాగే తయారైంది అని నాతో అమ్మ ప్రేమ పొందలేని వాడు బయటికి వెళ్లి బతకలేడు నిజం చెబుతున్నాను అర్థం చేసుకో అభి అని అంటుంది. నాకు పద్ధతి నేర్పించడం కాదు అంకిత ముందు భర్తని గౌరవించడం నేర్చుకో అని అంటాడు. మా మామ్ ని ఫాలో అయితే మన కాపురం కూడా వాళ్ల కాపురం లాగే ముక్కలు అవుతుంది. విడాకుల వరకు వెళుతుంది అని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతాడు అభి. అప్పుడు అందరు అభి మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు అభి కోపంగా లోపలికి వెళ్లి ఈ ఇల్లు మారదు ఇంట్లో మనుషులు మారరు ఎప్పుడు ఏదో ఏదో ఒక విషయంతో కొట్లాడుకుంటూనే ఉంటారు అనగా ఇంతలో అక్కడికి నందు వస్తాడు.
 

నీతో మాట్లాడాలి అనడంతో మాట్లాడండి పోట్లాడే ఓపిక నాకు లేదు అని అంటాడు అభి. అప్పుడు నందు నీ మాటలతో ఒక్కొక్కరి మనసులో తూటాలు పొడిచి వచ్చావు అని అనగా మీ మీద నాకు మంచి గౌరవం ప్రేమ ఉంది డాడ్ అంటుంది. అప్పుడు నందు చెప్పడానికి ప్రయత్నించినా అభి మాత్రం అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నందు అభికి తులసి గొప్పదనం గురించి చెబుతూ ఉండగా బయట లాస్య ఆ మాటలు వింటూ ఉంటుంది. నందు గోడ మీద పిల్లి ఎప్పుడు ఎలా దూకేస్తాడో తనకే తెలియదు అనుకుంటూ ఉంటుంది లాస్య. అప్పుడు నందు నేను మీ అమ్మ ప్రవర్తన నచ్చకపోతే 25 ఏళ్లు కాపురం చేసే వారిని కాదు ముగ్గురు పిల్లని కనే వాడిని కాదు అసలు డివర్స్ కి మీ అమ్మ కారణమే కాదు అని అనడంతో లాస్య షాక్ అవుతుంది.
 

 అందుకు పూర్తిగా నేనే కారణం అని అంటాడు నందు. ఎందుకు డాడీ మీ మీద తప్పు వేసుకుంటున్నారు అనగా తప్పు నా మీద వేసుకోవడం లేదు నిజం చెప్తున్నాను అభి నా మాట విను మీ మమ్మీ ని బ్లేమ్ చేయకు అని అభికి నచ్చచెబుతాడు నందు. అప్పుడు లాస్య మాత్రం ఏం జరుగుతుందో కాక అయోమయపడుతూ ఉంటుంది. మరొకవైపు తులసి అభి అన్న మాటలకు ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే అందరూ అక్కడికి రావడంతో నేను ఏడవడం లేదు అంటూ కవర్ చేసుకుంటూ ఉంటుంది తులసి. ఎవరు ఏమన్నా పట్టించుకోను కానీ నా పిల్లలు తప్పుపడితే నేను తట్టుకోలేను మామయ్య అని బాధతో మాట్లాడుతుంది తులసి. అప్పుడు అందరూ తులసి మాటలు విని బాధపడుతూ ఉంటారు.
 

 ఇంతలోనందు లాస్య కూడా అక్కడికి వచ్చి తులసి మాటలు వింటూ ఉంటారు. అంకితం నా నుంచి దూరం చేయాలనుకుంటున్నాను నేను అంత పాపిష్టి దాన్ని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అయినా మామయ్య చెప్పింది కరెక్టే అత్తయ్య వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోనిద్దాం ఎవరు అడ్డు పడొద్దు అంటుంది. వాడు ఇల్లు వదిలి వెళ్లినంత మాత్రం నా మనసులో నుంచి వెళ్ళిపోడు కదా అని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో అంకిత తులసి కాళ్లు పట్టుకుంటుంది. మీ అబ్బాయి తరుపున నేను క్షమాపణలు చెబుతున్నాను అంటే అని అంటుంది. లేదమ్మా వాడు చెప్పింది నిజమే నువ్వు నా గురించి ఆలోచిస్తూ అభికి దూరంగా ఉంటున్నావు ఈ ఇంటి గురించి నా గురించి ఆలోచించడం మానేసి వానికి దగ్గరగా ఉండు అంటుంది తులసి. అప్పుడు తులసి బాధపడుతూ ఉండగా ప్రేమ్ గిటార్ తీసుకొని వచ్చి పాట పాడి తులసీని నవ్వించాలని చూస్తాడు.

click me!