మైత్రి మూవీస్ సంస్థ ఆఫీస్ లో నేడు గ్రాండ్ గా ఈ చిత్రం లాంచ్ అయింది. ఈ చిత్ర లాంచ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, వివి వినాయక్ లాంటి దర్శకులు అతిథులుగా హాజరయ్యారు. ఇంతమంది అతిథులుగా పవన్ మూవీ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది. కానీ పవన్ స్నేహితులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం హాజరు కాలేదు.