మన హీరోలు ఇంత దారుణమా.. ఒకరిని మించి మరొకరు!

First Published Aug 24, 2019, 6:05 PM IST

90 దశకం వరకు టాలీవడ్ స్టార్ హీరోల నుంచి ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలు వచ్చేవి. కానీ ఆ తర్వాత జనరేషన్ హీరోలు ఏడాదికి ఒక సినిమా లేదంటే రెండు మాత్రమే చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇటీవల చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు. మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఎన్నేళ్లలో ఎన్ని సినిమాలు చేశారనే వివరాలు ఇవే. 

మహేష్ బాబు : మహేష్ హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు. 20 ఏళ్ల కెరీర్ లో మహేష్ చేసింది కేవలం 25 సినిమాలు మాత్రమే. 2008,09 సంవత్సరాలలో మహేష్ నుంచి ఏ సినిమా విడుదల కాలేదు.
undefined
ఎన్టీఆర్: తన 18 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్టీఆర్ చేసిన చిత్రాలు 28. కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్ స్పీడ్ గా సినిమాలు చేసినా ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక చిత్రంలోనే నటిస్తున్నాడు.
undefined
ప్రభాస్ : 17 ఏళ్ల కెరీర్ లో ప్రభాస్ చేసిన సినిమాలు 19(సాహోతో కలుపుకుని). ప్రభాస్ నటించిన మిర్చి చిత్రం 2013లో విడుదలయింది. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి రెండు భాగాలు, సాహో చిత్రంలో నటించాడు. ప్రభాస్ భారీ చిత్రాల్లో నటించడం ఓకే.. కానీ అతడి నుంచి మరిన్ని చిత్రాలు ఆశించే అభిమానులు కూడా ఉన్నారు.
undefined
పవన్ కళ్యాణ్ : ఈ జనరేషన్ హీరోల్లో చాలా స్లోగా సినిమాలు చేసేది పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. 22 ఏళ్ల కెరీర్ లో(2018 వరకు) పవన్ చేసింది 25 సినిమాలు మాత్రమే.
undefined
రానా : రానా తన 9 ఏళ్ల కెరీర్ లో తెలుగులో నటించిన చిత్రాలు ఎన్టీఆర్ బయోపిక్ తో కలుపుకుంటే కేవలం 9.
undefined
రామ్ చరణ్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ 12 ఏళ్లలో 12 సినిమాలు మాత్రమే చేశాడు.
undefined
నాగ చైతన్య : అక్కినేని నాగ చైతన్య తన 10 ఏళ్ల కెరీర్ లో 17 సినిమాల్లో నటించాడు.
undefined
నితిన్ : నితిన్ 17ఏళ్లలో 26 చిత్రాల్లో నటించాడు.
undefined
రామ్ : ఇటీవల ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రామ్ తన 13 ఏళ్ల కెరీర్ లో 17 చిత్రాలు చేశాడు.
undefined
కళ్యాణ్ రామ్ : ఈ నందమూరి హీరో 16ఏళ్లలో 18(ఎన్టీఆర్ బయోపిక్ తో కలుపుకుని) సినిమాల్లో నటించాడు.
undefined
వరుణ్ తేజ్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఐదేళ్లలో 8 చిత్రాల్లో నటించాడు.
undefined
అల్లు అర్జున్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి నుంచి 16 ఏళ్లలో 18 చిత్రాలు మాత్రమే చేశాడు.
undefined
click me!