Shriya Saran : ‘నాగార్జున నాకు చేసిన గొప్పసాయం’.. 20 ఏళ్ల తర్వాత బయటపెట్టిన శ్రియా శరణ్

Published : Mar 14, 2024, 10:27 PM IST

బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రియా శరణ్ తాజాగా నాగార్జున (Nagarjuna) పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 20 ఏళ్లకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది.   

PREV
16
Shriya Saran : ‘నాగార్జున నాకు చేసిన గొప్పసాయం’.. 20 ఏళ్ల తర్వాత బయటపెట్టిన శ్రియా శరణ్

స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) కింగ్, అక్కినేని నాగార్జునతో పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో నటించడంపై తాజాగా ఈ ముద్దుగుమ్మ స్పందించింది. 
 

26

ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో ‘సంతోషం’, ‘నేనున్నాను‘, ‘ఊపిరి’, ‘మనం’ వంటి సినిమాలతో బాగా అలరించారు. వీరి కెమిస్ట్రీకి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. 
 

36

నాగార్జున ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించినప్పటికీ శ్రియా - నాగార్జున కాంబో చాలా మందిని ఆకట్టుకుంది. ఆ సినిమాలు కూడా ఇప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచాయి. 
 

46

అయితే శ్రియా శరణ్ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. పెళ్లి, కూతురుకు జన్మినిచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో యాక్టివ్ గా మారింది. ముఖ్యంగా హిందీ చిత్రాల్లో నటిస్తూ సందడి చేస్తోంది. 
 

56

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియా శరణ్ నాగార్జున గురించి ఆషక్తికరంగా కామెంట్లు చేసింది. ‘సౌత్ లో అద్భుతమైన నటులు ఉన్నారు. వారిలో నేను నాగార్జునతో కలిసి పనిచేశాను.’

66

‘ఆయన నాకు ముఖ్యంగా ధ్యానం ఎలా చేయాలో అర్థమయ్యేలా నేర్పించారు. దాని వల్ల ఇప్పటికీ నేను నా లైఫ్ లో ప్రతిరోజూ అన్ని పరిస్థితులను ఎదుర్కొగలుగుతున్నాను.’ అని చెప్పుకొచ్చింది. ఇదే తనకు లైఫ్ లోచేసిన గొప్ప సాయంగా భావించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories