దమ్ దమ్ చేస్తానన్న సరయు.. భరించలేకపోయిన ఫ్యామిలీ ఆడియన్స్, ఎలిమినేట్ కావడానికి కారణాలు!

First Published Sep 13, 2021, 9:27 AM IST

అప్పటి వరకు కాస్త చప్పగా సాగినట్లు అనిపించిన బిగ్ బాస్ సీజన్ 5కి ఆదివారం ఎపిసోడ్ తో ఊపొచ్చింది అని చెప్పొచ్చు. ముందుగా అందిన లీకుల ప్రకారమే సరయు ఎలిమినేట్ అయింది.

అప్పటి వరకు కాస్త చప్పగా సాగినట్లు అనిపించిన బిగ్ బాస్ సీజన్ 5కి ఆదివారం ఎపిసోడ్ తో ఊపొచ్చింది అని చెప్పొచ్చు. ముందుగా అందిన లీకుల ప్రకారమే సరయు ఎలిమినేట్ అయింది. సీజన్ 5లో ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ ఆమె. వాస్తవానికి సరయుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

యూట్యూబ్ తో పాపులర్ అయిన బోల్డ్ బ్యూటీ ఆమె. యూట్యూబ్ లో ఆమె బోల్డ్ వీడియోలు ఎలా ఉంటాయో యువతకు బాగా తెలుసు. దీనితో సరయు హౌస్ లో రచ్చ రచ్చ చేస్తుంది అని అంతా భావించారు. అందుకు తగ్గట్లుగానే తొలి రోజు హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు నాగ్ తో.. లోపలికి వెళ్ళాక దమ్ దమ్ చేసి చూపిస్తా అంటూ బీరాలు కూడా పలికింది. 

ఆమ్మో ఈమెని తట్టుకోవడం మిగిలిన కంటెస్టెంట్స్ వల్ల అవుతుందా అని కూడా భావించారు. కానీ సరయు తొలి వారంలో చేసిన తప్పులే ఎలిమినేట్ అయ్యేలా చేశాయి. సరయు ఎలిమినేట్ కావడానికి కొన్ని కారణాలు పరిశీలిస్తే.. మొదటిది ఆమె స్క్రీన్ స్పేస్ కోసం ప్రయత్నించలేదు. ముఖ్యమైన సమయాల్లో చురుగ్గా పాల్గొనలేదు. 

మానస్, విజె సన్నీ, కాజల్ ముగ్గురూ ఆమెని నామినేట్ చేయడంతో నామినేషన్ జోన్ లోకి వచ్చింది. అప్పుడప్పుడూ కెమెరాకు కనిపించినా.. ఆ టైంలో తాను జెన్యూన్ అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో బలవంతంగా కలిగించాలి అని తాపత్రాయ పడ్డట్లు అనిపించింది. 

ఇక అతి ముఖ్యమైన కెప్టెన్సీ టాస్క్ లో ఫోకస్ మొత్తం నాపైనే పడాలి అన్నట్లుగా పెద్ద తప్పు చేసింది. కెప్టెన్సీ టాక్స్ లో పోటీ పడుతున్న వారికి మిగిలిన కంటెస్టెంట్స్ సపోర్ట్ చేయవచ్చు లేదా డిస్ట్రబ్ కూడా చేయవచ్చు అని బిగ్ బాస్ ముందుగానే ప్రకటించారు. కానీ ఆ పాయింట్ ని సరయు అర్థం చేసుకోకుండా విశ్వ కోసం తానొక్కటే ఒంటరి పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ కాజల్ తో గొడవ పడింది. 

విశ్వని టార్గెట్ చేయడం కాజల్ ఇష్టం. అది గ్రహించకుండా విశ్వని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశావు అంటూ సరయు విరుచుకుపడింది. అది పెద్ద మైనస్ గా మారింది. అక్కడ టాస్క్ ప్రకారమే చేసిన కాజల్ కు సింపతీ పెరిగింది. ఆఖరికి ప్రియా లాంటి వాళ్ళు చెబుతున్నా సరయు పట్టించుకోలేదు. 

ఇక సరయు ప్రేక్షకులతో ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు కదా.. తనపై ప్రేక్షకుల్లో నెగిటివ్ ఫీలింగ్ కలిగేలా చేసుకుంది. స్మోకింగ్ అనేది ఆమె వ్యక్తిగత విషయమే కావచ్చు.. కానీ బిగ్ బాస్ కు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు.. వారి చేతిలో కూడా ఓట్లు ఉన్నాయి అని గ్రహించలేకపోయింది. మొత్తంగా తొలి వారంలోనే సరయు ఎలిమినేట్ కావడానికి ఇవ్వన్నీ కారణాలు అని చెప్పొచ్చు. 

click me!