అంజలి హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో సింగం 2, సరైనోడు చిత్రాల్లో ఐటెం సాంగ్ లో నటించిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా ‘రా రా రెడ్డి’ సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అద్భతమైన సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ క్రేజీ లిరిక్స్ రాశారు. సింగర్ లిప్సికా గాత్ర దానం చేసింది.