పవన్‌ కళ్యాణ్‌ రేంజ్‌లో సుడిగాలి సుధీర్‌ క్రేజ్‌.. స్టేజ్‌పైన అనసూయ, కె రాఘవేంద్రరావులకు షాక్‌.. వామ్మో

Published : Aug 14, 2022, 10:34 PM ISTUpdated : Aug 15, 2022, 07:10 AM IST

సుడిగాలి సుధీర్‌ `జబర్దస్త్`తో పాపులర్‌ అయ్యాడు. హీరోగా మారడంతో అతని ఫాలోయింగ్‌ మరింతగా పెరిగింది. అయితే అది మామూలు స్థాయిలో కాదు, ఏకంగా పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ తరహాలో హోరెత్తించడం విశేషం.   

PREV
17
పవన్‌ కళ్యాణ్‌ రేంజ్‌లో సుడిగాలి సుధీర్‌ క్రేజ్‌.. స్టేజ్‌పైన అనసూయ, కె రాఘవేంద్రరావులకు షాక్‌.. వామ్మో

`జబర్దస్త్` ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌కి ఈ షో ఎంతో గుర్తింపుని తీసుకొచ్చింది. ఇంటర్నెట్‌లో మంచి ఫాలోయింగ్‌ని పెంచింది. టీవీ ఆడియెన్స్ కి దగ్గర చేసింది. జబర్దస్త్ షోని చూసే వాళ్లు చాలా వరకు సుధీర్‌ అభిమానులుగా మారిపోయారు. కుర్రాళ్లు మాత్రం ఆయన్ని ఫాలో అవడం ప్రారంభించారు. బుల్లితెరపై ఓ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ సుడిగాలిసుధీర్‌ సొంతమంటే అతిశయోక్తి కాదు. 
 

27

ఆ ఇమేజ్‌ రేంజ్‌ ఏంటో తాజాగా చూపించారు ఆయన అభిమానులు. ఆయన నటించిన సినిమా ఈవెంట్‌లో సుధీర్‌ రాకతో హోరెత్తించారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ తరహాలో అరుపులతో మారుమోగించడం విశేషం. సుధీర్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తున్న చిత్రం `వాంటెడ్‌ పండుగాడ్‌`. కె. రాఘవేంద్రరావు సమర్పణలో, శ్రీధర్‌ సీపాన రూపొందించిన చిత్రమిది. ఇందులో సుడిగాలి సుధీర్‌, సునీల్‌, అనసూయ, దీపికా పిల్లి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. 
 

37

`వాంటెడ్‌ పండుగాడ్‌` చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ని నిర్వహించారు. ఇందులో అనసూయ చివర్లో రావడంతో ఆమె కోసం అభిమానులు హో ఏసుకున్నారు. ఆ వెంటనే ఆమెతో మాట్లాడించారు. దీంతో కాసేపు అరుపులతో గోల చేసిన అభిమానులు.. అంతలోనే సుడిగాలి సుధీర్‌ ఈవెంట్‌కి రావడంతో మరింతగా రెచ్చిపోయారు. కంటిన్యూగా హోరెత్తించారు. అరుపులు, ఈలలు, కేకలతో రచ్చ చేశారు. 

47

అనసూయ మాట్లాడుతున్న సమయంలోనే ఇది జరగడంతో ఆమె వారిని సముదాయించి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. మరింత పెంచి హోరెత్తించారు. దీంతో మధ్య లోనే అనసూయ తన ప్రసంగాన్ని ముగించింది. ఆమె వద్ద నుంచి మైక్‌ తీసుకుని అభిమానులను సముదాయించే ప్రయత్నం చేశారు కె. రాఘవేంద్రరావు. ఆయన కూడా వారిని వారించే ప్రయత్నంచేయగా, ఫ్యాన్స్ ఆగలేదు. దీంతో సుడిగాలి సుధీర్‌కి మైక్‌ ఇచ్చేశాడు రాఘవేంద్రరావు. 

57

కానీ కాసేపు గ్యాప్‌ ఇచ్చారు. అప్పుడే సుధీర్‌ మాట్లాడితే కిక్‌ ఉండదని భావించిన యాంకర్‌ కాసేపు ఆపి, బిగ్‌ టికెట్‌ లాంచ్‌ చేయించారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడారు. ఆయన తర్వాత సుడిగాలి సుధీర్‌కి మైక్‌ ఇవ్వగా మరోసారి రెచ్చిపోయారు అభిమానులు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల తరహాలో అరుపులతో మోతమోగించారు. దీంతో ప్రాంగణం మొత్తం దద్దరల్లినంత పనైంది. సుడిగాలి సుధీర్‌కి ఈ రేంజ్‌ ఫాలోయింగ్‌ ని చూసి రాఘవేంద్రావు, అనసూయ మాత్రమే కాదు, మిగిలిన వారంతా షాక్‌ అవుతున్నారు. 
 

67

చివరగా మాట్లాడిన సుడిగాలి సుధీర్‌.. ఇప్పటికే ఏం మాట్లాడాలో తెలియక టెన్షన్‌గా ఉందని, మళ్లీ మీరు ఇలా అరిస్తే మరింత టెన్షన్‌గా ఉంటుందని చెప్పగా, కాస్త సైలెంట్‌ అయ్యారు. రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగిన తాను.. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు సుధీర్‌. ఈ చిత్రాన్ని థియేటర్లోనే చూసి ఆనందించాలని, మిగిలిన అన్ని సినిమాలను ఆదరించాలని తెలిపారు. 

77

అనసూయకి సోషల్‌ మీడియాలో భారీ క్రేజ్‌ ఉంది. కానీ సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ దెబ్బకి ఆమె సైలెంట్‌ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే వీరిద్దరు కలిసి ఇప్పుడు `సూపర్‌ సింగర్‌ జూనియర్‌` షోకి హోస్ట్ గా చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories