అసిస్టెంట్ డైరెక్టర్ తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరో కూతురు... హాట్ టాపిక్ గా సారా కొత్త ప్రేమకథ!

First Published Jul 1, 2021, 3:11 PM IST

బొద్దుగా షేప్ అవుట్ బాడీలో ఉండే సారా హీరోయిన్ కావడం కోసం కష్టపడి బరువు తగ్గి స్లిమ్ బాడీ సాధించింది. స్టార్ కిడ్ కావడంతో స్లిమ్ అయిన వెంటనే ఆఫర్స్ ముందుకు వచ్చాయి. 
 

అలా 2018లో విడుదలైన కేధార్ నాథ్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత రణ్వీర్ సింగ్ తో సింబా, ఆర్యన్ కార్తీక్ తో లవ్ ఆజ్ కల్, వరుణ్ ధావన్ కి జంటగా కూలి నంబర్ వన్ చిత్రాలలో నటించారు.
undefined
నాలుగు చిత్రాలలో నటించినా సారా కు సరైన బ్రేక్ రాలేదు. డెబ్యూ మూవీ కేధార్ నాథ్, సింబా పర్వాలేదనిపించాయి. ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న అత్రాంగిరే చిత్రంలో సారా అలీఖాన్ నటిస్తున్నారు. తాను నటించిన చిత్రాల కంటే అఫైర్స్ తో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది సారా అలీ ఖాన్.
undefined
సుశాంత్ సింగ్ డెత్ సంఘటన తరువాత ఆయనతో సారా ఎఫైర్ విషయం బయటికి వచ్చింది. సుశాంత్ తో టూర్స్, పార్టీలు బీభత్సంగా ఎంజాయ్ చేశారని తెలిసింది.
undefined
డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న సారా విచారణకు కూడా హాజరయ్యారు. ఇక లవ్ ఆజ్ కల్ మూవీ సమయంలో హీరో ఆర్యన్ కార్తీక్ ప్రేమలో పడినట్లు వార్తలు రావడం జరిగింది. అలాగే కొన్నాళ్ళకు విడిపోయారని కూడా తెలిసింది.
undefined
తాజాగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. 'కేదార్ నాథ్'. ఆ సినిమాకి ఏడీగా పనిచేసిన జెహాన్ హండాతో ప్రస్తుతం ఎఫైర్ లో ఉన్నట్లు పుకార్లు రేగాయి. దానికి కారణం అతనితో బీచ్ లో దిగిన ఫోటోలు ఈ మధ్యే సారా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కనిపించాయి.
undefined
అంతే కాదు, మిస్ అలీఖాన్ 'లవ్ యూ', 'టేక్ మీ బ్యాక్' అంటూ రొమాంటిక్ పదాలు కూడా వాడేసింది. అంతకు ముందు అవే ఫోటోల్ని జెహాన్ హండా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేశాడు. వాట్ని సారా కూడా మనసారా నెటిజన్స్ తో పంచుకుంది.
undefined
జెహాన్ హండా సారా ఫోటోల్ని షేర్ చేయటం ఇదేం కొత్త కాదు. పోయిన సంవత్సరం ఓ వీడియోలో వారిద్దరి హ్యాపీ మూమెంట్స్ ని జనంతో పంచుకున్నాడు.
undefined
సారా మీద తన ప్రేమని, ఇష్టాన్ని చాటుతు ఒకింత పెద్ద పోస్టునే రాశాడు. నీకు నేను ఉన్నాను ముందుకు వెళ్ళు అంటూ భరోసా ఇచ్చాడు.
undefined
సారా పరిశ్రమకు పరిచయమై పట్టుమని ఐదేళ్లు కాలేదు. అప్పుడే తెరపైకి అనేక ప్రేమకథలు రావడం జరిగింది. సారా కెరీర్ కంటే ఎఫైర్స్ పైనే ఎక్కువ ద్రుష్టి పెడుతుందేమో అనిపిస్తుంది.
undefined
click me!