గంగూబాయ్ అవతారంలో రాములమ్మ, అచ్చం ఆలియా భట్ లా శ్రీముఖి ఫోజులు, ఫిదా అవుతున్న నెటిజన్లు

First Published Nov 8, 2022, 10:33 PM IST

యాంకర్ గా  బిజీ అయిపోయింది శ్రీముఖి.  ఆమధ్య బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తరువాత కాస్త డల్ అయ్యింది శ్రీముఖి. ఇక యాంకర్ గా కనిపించదేమో అనుకున్న టైమ్ కు.. చిన్నగా అవకాశాలు పెరిగిపోయాయి. బుల్లి తెరపై ప్రస్తుతం నాలుగైదు షోస్ కు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. 

యాంకర్ గా  బిజీ అయిపోయింది శ్రీముఖి.  ఆమధ్య బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తరువాత కాస్త డల్ అయ్యింది శ్రీముఖి. ఇక యాంకర్ గా కనిపించదేమో అనుకున్న టైమ్ కు.. చిన్నగా అవకాశాలు పెరిగిపోయాయి. బుల్లి తెరపై ప్రస్తుతం నాలుగైదు షోస్ కు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. 

అటు టెలివిజన్ తో పాటు.. ఇటు సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి రెచ్చిపోతుంది. అవకాశాలు పెంచుకోవడం కోసం, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడం కోసం ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోస్ తో అదరగోడుతోంది. ఈక్రమంలోనే రీసెంట్ గా గంగూబాయ్ అవతారం ఎత్తింది రాములమ్మ.  

వరుస ప్రోగ్రామ్స్ తో సందడి చేస్తున్న శ్రీముఖి.. తాజాగా మిస్టర్ అండ్ మిసెస్...ఒకరికి ఒకరు అనే రియాల్టీ షో  కి కూడా  హోస్టింగ్ చేస్తోంది. ఈ షోలో నటుడు శివ బాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రాం తాజా ఎపిసోడ్ లో గంగూబాయ్ అవతారంలో కనిపించింది శ్రీముఖి. 

ఈ షోలో శ్రీముఖి గెటపే ఈ ఎపిసోడ్ కి హైలెట్ అయ్యింది. మిస్టర్ అండ్ మిసెస్ షో పేరు అయినప్పటికీ వారానికో కొత్త థీమ్ తో ప్లాన్ చేస్తున్నారు. ఈ వారం ఎపిసోడ్ లో  భాగంగా శ్రీముఖి రెగ్యులర్ గా స్టైలిష్ లుక్ లో కాకుండా కొత్త గెటప్ లో సర్ప్రైజ్ ఇచ్చింది. 

ఏకంగా హిందీలో అలియా భట్ పోషించిన గంగూ భాయ్ కతియావాడి గెటప్లో దర్శనం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది స్టార్ యాంకర్. అంతే కాదు ఈ గెటప్ తో  శ్రీముఖి ఫోటో షూట్ కూడా చేసింది. 
 

ఈ పిక్స్ ను తన ఇన్ స్టా పేజ్ లో అప్ లోడ్ చేసింది స్టార్ యాంకర్. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లటి చీర కట్టుకొని.. నల్ల కళ్లద్దాలు .. నుదిటిపై ఎర్రని బొట్టు ఇలా అచ్చం ఆలియా భట్ లా.. గెటప్ వేసుకుని  అందరినీ ఆకట్టుకుంది. 

ప్రోగ్రామ్ లో కూడా  శ్రీముఖి గెటప్ చూసి యాక్టర్  శివబాలాజీ ఆమెకు మంచి క కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు.  మొత్తానికి అటు ప్రోగ్రామ్ లో.. ఇటు సోషల్ మీడియాలో... శ్రీముఖి గంగూబాయ్ గెటప్ తో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా. వైరల్ అయ్యింది. 

click me!