Latest Videos

మెగా ఫ్యామిలీ పరువు తీసిన లావణ్య త్రిపాఠి... ఏడాదిలోపే కొత్త కోడలు చేసిన పనికి తిట్టిపోస్తున్న జనాలు!

By Sambi ReddyFirst Published May 16, 2024, 8:21 PM IST
Highlights

లావణ్య త్రిపాఠి చేసిన పని మెగా ఫ్యామిలీ విమర్శలకు గురైంది. ముఖ్యంగా చిరంజీవి భార్య సురేఖ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతకీ లావణ్య త్రిపాఠి చేసి తప్పేంటని పరిశీలిస్తే... 
 

హీరో వరుణ్ తేజ్ ని పెళ్లాడిన లావణ్య త్రిపాఠి మెగా కోడలు హోదా పొందింది. టాలీవుడ్ ని శాసిస్తున్న అతిపెద్ద కుటుంబంలో ఆమె అడుగుపెట్టారు. ఏళ్ల తరబడి రహస్యంగా ప్రేమించుకున్న లావణ్య-వరుణ్ గత ఏడాది ఎంగేజ్మెంట్ ప్రకటన చేశారు. 2023 నవంబర్ 5న ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మెగా హీరోలందరూ ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. 

మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి స్టేటస్ మారిపోయింది. అదే సమయంలో ఆమె బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. కాగా లావణ్య త్రిపాఠి అనాలోచితంగా చేసిన పని ఓ పని వివాదానికి దారి తీసింది. చిరంజీవి సతీమణి సురేఖ నడుపుతున్న బిజినెస్ పై నెగిటివ్ ఒపీనియన్ కలిగేలా చేసింది. ఉపాసన కొణిదెల  కొద్ది రోజుల క్రితం అత్త సురేఖ చేత బిజినెస్ స్టార్ట్  చేయించింది. అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టారు. 

అత్తమ్మాస్ కిచెన్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా స్టార్ట్ చేశారు. అత్తమ్మాస్ కిచెన్ సంస్థకు ప్రచారం కల్పించాలనే క్రమంలో లావణ్య త్రిపాఠి, అత్తయ్య పద్మజతో కలిసి ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేశారు. అత్తమ్మాస్ కిచెన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవుతున్న నెటిజెన్స్ నుండి ఈ  ఫోటోలపై   వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఎలాంటి  భద్రతా ప్రమాణాలు పాటించకుండా కష్టమర్స్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారని మండిపడుతున్నారు. 

ఆవకాయ పచ్చడి చేస్తున్న లావణ్య త్రిపాఠి, పద్మజ చేతులకు గ్లౌజులు ధరించలేదు. హెయిర్ పడకుండా తలకు క్యాప్స్ ధరించలేదు. ఈ పాయింట్స్ లేవనెత్తుతూ నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అత్తమ్మాస్ కిచెన్ సంస్థ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అది ఇంట్లో అవసరాలకు చేసిన ఆవకాయ్. కష్టమర్స్ కోసం కాదు. మేము కస్టమర్లకు రుచి, శుచితో కూడిన ఫుడ్ ఇచ్చేందుకు ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. లావణ్య కారణంగా మెగాస్టార్ భార్య స్థాపించిన అత్తమ్మాస్ కిచెన్ పరువు ప్రమాదంలో పడింది. 


 

click me!