జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట్లో ఊహించని విషాదం..! 

Published : May 16, 2024, 12:37 PM ISTUpdated : May 16, 2024, 02:54 PM IST
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట్లో ఊహించని విషాదం..! 

సారాంశం

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మృతి చెందారు. నువ్వు లేకుండా బ్రతకలేనంటూ కెవ్వు కార్తీక్ భావోద్వేగానికి గురి కావడం కలచి వేస్తుంది.   

జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో కెవ్వు కార్తీక్ ఒకడు. టీమ్ మెంబర్ గా పరిచయమై లీడర్ గా ఎదిగాడు. కెవ్వు కార్తీక్-ముక్కు అవినాష్ ఒక టీమ్ కి లీడర్స్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ముక్కు అవినాష్ జబర్దస్త్ కి దూరమయ్యాడు. కెవ్వు కార్తీక్ సోలోగా టీమ్ ని లీడ్ చేస్తున్నాడు. తనదైన కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న కెవ్వు కార్తీక్ హీరో నాగార్జునను చక్కగా ఇమిటేట్ చేస్తాడు 

అందరి చేత నవ్వులు పూయించే కెవ్వు కార్తీక్ జీవితంలో మాత్రం విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి కన్నుమూశారు. కెవ్వు కార్తీక్ తల్లి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే. గతంలో ఆమె పలు టీవీ షోలలో పాల్గొన్నారు. ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కెవ్వు కార్తీక్ తన సంపాదనతో నన్ను బ్రతికించాడని చెప్పి ఆమె ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కార్తీక్ కి నేను జన్మనిస్తే వాడు నాకు పునర్జన్మ ఇచ్చాడని ఆమె అంటారు. 

కోలుకున్నారు... ఆమెకు ఏమీ కాదని అనుకుంటున్న తరుణంలో మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెవ్వు కార్తీక్ తల్లి బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని కెవ్వు కార్తీక్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఐదేళ్లుగా క్యాన్సర్ తో అలుపెరుగని పోరాటం చేస్తున్న అమ్మ తుది శ్వాస విడిచారని ఆయన వెల్లడించాడు. భావోద్వేగంతో కూడిన కెవ్వు కార్తీక్ పోస్ట్ వైరల్ అవుతుంది. 

కెవ్వు కార్తీక్ అభిమానులు తల్లి మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. కెవ్వు కార్తీక్ తల్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీపను ఏడిపించాలనుకున్న జ్యో- దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కార్తీక్
Pochamma OTT Review: పోచమ్మ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. ఆహా ఓటీటీ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?