మహేష్‌ బాబు హీరోయిన్‌గా శ్రీలీలా.. షాకింగ్‌ లైనప్.. ఏకంగా ఏడు సినిమాలు

First Published Nov 27, 2022, 4:58 PM IST

హీరోయిన్లు ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోతుంటారు. ఆ కోవలోనే `పెళ్లిసందడి` భామ శ్రీలీలా చేరుతుంది. ఈ బ్యూటీ ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌తో జోడీ కట్టే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది.
 

కన్నడ భామల జోరు సాగుతుంది. తాజాగా మరో కన్నడ బ్యూటీ శ్రీలీలా రచ్చ చేస్తుంది. తొలి చిత్రం `పెళ్లిసందD`లో మెరిసింది. ఆద్యంతం ఆకట్టుకుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆమెని మరింత గ్లామరస్‌గా చూపించారు. అంతేకాదు ఆమెకి అవకాశాలు రావడంలోనూ ఆయన హస్తంఉందనే టాక్‌ వినిపిస్తుంది. మరి నిజమేంటనేది పక్కన పెడితే శ్రీలీలా లైనప్‌ షాకిస్తుంది.

తాజాగా ఓ బంపర్‌ ఆఫర్‌ని అందుకుంది శ్రీ లీలా. సూపర్‌ స్టార్‌ మహేష్‌తో జోడీ కట్టే అరుదైన ఛాన్స్ ని దక్కించుకుంది. మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. తాజాగా ఇందులో హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. 

ఇందులో మెయిన్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీలా సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించనుందని సమాచారం. జనరల్‌గా త్రివిక్రమ్‌ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. మెయిన్‌ లీడ్‌ ఒకరు, సపోర్టింగ్‌ హీరోయిన్‌గా మరొకరు ఉంటారు. ఆ ట్రెండ్‌ని మహేష్‌ సినిమాకి కూడా ఫాలో అవుతున్నారని, అందులో భాగంగా శ్రీలీలాని తీసుకున్నారట. అయితే సెకండ్‌ హీరోయిన్‌కి పెద్దగా స్కోప్‌ ఉండదు. ఆ పాత్ర చేసినా ప్రయోజనం లేదనే టాక్‌ వినిపిస్తుంటుంది. మరి శ్రీలీలాకైనా బలమైన పాత్ర దొరుకుతుందా? అనేది చూడాలి. 
 

ఇదిలా ఉంటే శ్రీలీలా కొత్త సినిమాల లైనప్‌ చూస్తే మతిపోతుంది. ఆమె ఏకంగా ఏడు సినిమాల్లో నటిస్తుంది. అందులో అన్నీ క్రేజీ ప్రాజెక్ట్ లే కావడం విశేషం. ఇప్పటికే మాస్‌ మహారాజాతో `ధమాకా` చిత్రంలో నటించింది శ్రీలీలా. ఈ చిత్రం డిసెంబర్‌ 23న విడుదల కాబోతుంది. దీంతోపాటు బాలకృష్ణకి కూతురిగా అనిల్‌రావిపూడి చిత్రంలో ఎంపికైంది. దీంతోపాటు నవీన్‌ పొలిశెట్టితో `అనగనగా ఒక రాజు` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. 

వీటితోపాటు నితిన్‌తో ఓ సినిమా చేస్తుంది. అలాగే పంజా వైష్ణవ్‌ తేజ్‌తో మరో సినిమా చేస్తుంది. అలాగే బోయపాటి, రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇలా ఏడు సినిమాల లైనప్‌తో ఫుల్‌ బిజీగా ఉంది. వీటితోపాటు మరో రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట. టాలీవుడ్‌లోనే అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్‌గా నిలిచింది. తనకు పోటీగా ఉన్న కృతి శెట్టిని వెనక్కి నెట్టేసి జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుంది శ్రీలీలా. యంగ్‌ హీరోలకు ఈ అందాల భామ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. 

click me!