రెండో పెళ్లితో సింగర్ సునీత లైఫ్ సెటిల్... రామ్ ఆస్థి విలువ తెలిస్తే షాకే!

First Published Jan 17, 2021, 6:28 PM IST


స్టార్ సింగర్ సునీత రెండో వివాహం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు 42ఏళ్ల వయసులో... పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉండగా రెండో పెళ్లి ఏమిటని విమర్శించారు. మరికొందరు తోడు కోరుకోవడంలో తప్పేముందని సమర్ధించారు. మెజారిటీ వర్గం సునీతకు మద్దతుగా నిలిచారు. 
 

నిశ్చితార్ధం సమయంలోనే ఈ విమర్శలు ఊహించిన సునీత... సోషల్ మీడియా సందేశం ద్వారా తన పెళ్లి నిర్ణయం వెనుక ఆంతర్యం తెలియజేశారు. తనతో పాటు, పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని రామ్ తో పెళ్ళికి సిద్దమయ్యాను అన్నారు. తన నిర్ణయాన్ని గౌరవించి మద్దతుగా నిలవాలని ఆమె అభ్యర్ధించారు.
undefined
ఏదిఏమైనా సునీత వివాహం జరిగిపోయింది. రెండో పెళ్లి అయినప్పటికీ రామ్ తన స్టేటస్ కి తగ్గట్టుగా టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఈ వివాహం చేసుకున్నారు. నితిన్, దిల్ రాజు, సుమ వంటి సెలెబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.
undefined
సునీత మొదట్లో చెప్పినట్లు రామ్ ని వివాహం చేసుకోవడంతో తన లైఫ్ సెటిల్ అయినట్లు తెలుస్తుంది. ఏళ్లుగా పరిశ్రమలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటికీ ఒక దశలో సునీత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న మాట వినిపించింది.
undefined
ఇకపై సునీతకు అలాంటి కష్టాలు ఎదురయ్యే ఆస్కారం లేదు. కారణం రామ్ ఆస్థి విలువ వందల కోట్లని సమాచారం. తన మీడియా సంస్థ మాంగో ద్వారా ఆయన పెద్ద మొత్తంలో ఆర్జించారట.
undefined
అలాగే చిత్ర ప్రముఖులతో పాటు రాజకీయ పలుకుబడి కలిగిన రామ్ కి అనేక వ్యాపారాలు, స్థిర చర ఆస్థులు ఉన్నాయని సమాచారం. దీనితో జీవితాంతం కూర్చొని తిన్నా తరగని ఆస్థి ఉన్న రామ్ ని వివాహం చేసుకొని భవిష్యత్ పై భరోసా సాధించారట.
undefined
ముందుగా ఆమె సోషల్ మీడియా సందేశంలో చెప్పినట్లు ఈ పెళ్లితో సునీత మరియు ఆమె పిల్లల భవిష్యత్ కి సెక్యూరిటీ దొరికినట్లు అయ్యింది.  ఇవన్నీ ఆలోచించిన సునీత రెండో వివాహానికి మొగ్గు చూపారని అర్థం అవుతుంది.
undefined
అయితే సునీత్‌ ఇంత ఆనందంగా ఉండటంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏం సాధించారని ఇంత ఆనందమంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ సునీతపై విమర్శలు గుప్పించాడు.
undefined
click me!