దీపికా, ప్రియాంక, మలైకా నీకెవ్వరు లేరు పోటీ.. శివాత్మిక నువ్వు కేక.. రాజశేఖర్‌ తనయ క్యూట్‌ వార్నింగ్‌!

First Published Apr 25, 2021, 9:32 AM IST

ఇటీవల ఊహించని విధంగా స్కిన్‌ షో చేసి కుర్రాళ్ల మతిపోగొట్టిన రాజశేఖర్‌ తనయ శివాత్మిక ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. అంతేకాదు తనని దీపికా, ప్రియాంక, మలైకాలతో పోలుస్తూ కామెంట్‌ పెట్టినందుకు ఫైర్‌ అయ్యింది. నెటిజన్‌కి క్యూట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. 

`దొరసాని` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరో రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక రాజశేఖర్‌ ఆ మధ్య అందాలు ఆరబోసిన విషయం తెలిసిందే. అత్యంత సెక్సీ గా పోజులిస్తూ దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకోగా అవి తెగ వైరల్‌ అయ్యాయి.
undefined
తాజాగా మరింత స్టయిలీష్‌గా, సెక్సీ పిక్స్ ని పంచుకుంది శివాత్మిక. బర్త్ డే సందర్భంగా శారీలో హాట్‌గా మెరిసింది. ఈ అమ్మడు పొట్టి డ్రెస్సుల్లో కంటే చీరలోనే మరింత సెక్సీగా కనిపించడం విశేషం.
undefined
పాత కాలం నాటి టెలిఫోన్‌ పట్టుకుని నడుమందాలను చూపిస్తూ శివాత్మిక ఇచ్చిన లేటెస్ట్ పోజులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. ఫిదా చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో హీటు పెంచుతున్నాయి. ఈ సందర్భంగా `దొరసాని` ఆల్టర్‌ ఈగో, యువరాణి పరిచయం` అంటూ పోస్ట్ పెట్టింది శివాత్మిక.
undefined
ఈ సందర్భంగా హీరోయిన్‌ ఈషా రెబ్బా కామెంట్‌ చేయడం విశేషం. `వోలాలా `అంటూ ఆమె అందాలను పొగిడింది. అయితే నువ్వు ఏంట్రా ఇలా అంటూ శివాత్మిక స్పందించడం విశేషం. ఈషారెబ్బా, శివాత్మిక, శివానీ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే.
undefined
ఇదిలా ఉంటే నెటిజన్లు, ఆమె అభిమానులు కామెంట్లతో శివాత్మిక అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్యూటీఫుల్‌, గార్జియస్‌ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఓ నెటిజన్‌ శివాత్మికని దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, మలైకాలతో పోల్చాడు.
undefined
`దీపికా, ప్రియాంక, మలైకా.. ఇక నీకు ఎవ్వరు పోటీ రాలేదు.. శివాత్మిక నువ్వు కేక` అంటూ కామెంట్‌ పెట్టాడు. దీనికి శివాత్మిక స్పందిస్తూ `అరే ఇదే లాస్ట్ వార్నింగ్‌. మళ్లీ ఇలాంటి పోస్ట్ పెడితే బ్లాక్‌ చేసేస్తా` అంటూ క్యూట్‌గా వార్నింగ్‌ ఇచ్చింది.
undefined
మరోవైపు శివాత్మిక బ్లాక్‌ శారీలో అత్యంత హాట్‌గా కనిపిస్తుంది. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌ అనేలా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్‌ కూడా వైరల్‌గా మారాయి.
undefined
`దొరసాని`తో హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన శివాత్మిక ప్రస్తుతం తెలుగులో `పంచతంత్రం` అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో లేఖగా ఆమె కనిపించబోతున్నారు. దీంతోపాటు తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేస్తుంది. ఇటీవలే దాని ఫస్ట్ లుక్‌ విడుదలై ఆకట్టుకుంది. తల్లి జీవిత మాదిరిగానే శివాత్మిక కూడా తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా రాణించాలని గట్టిగానే ప్లాన్‌ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
undefined
click me!