శిల్పా శెట్టి భర్త పోర్న్ ఆగడాలు.. శాలువాల బిజినెస్‌ నుంచి పోర్న్ వీడియోల దాకా రాజ్‌ కుంద్రా దందా!

First Published Jul 20, 2021, 9:53 AM IST

సాగరకన్య శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్ర పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడిది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అంతేకాదు రాజ్‌కుంద్ర ఈజీ మనీ కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కారని పోలీసులు నిర్ధారించారు. 
 

ఐపీఎల్‌ బిజినెస్‌తో పాపులర్‌ అయ్యారు రాజ్‌కుంద్ర. ఆయన రాజస్థాన్‌ రాయల్‌ టీమ్‌కి హోనర్‌గా ఉన్నారు. ఇన్నాళ్లపాటు ఆద్యంతం సక్సెస్‌ఫుల్‌గా సాగిన ఈ బిజినెస్‌ గత ఏడాది నుంచి పడకేసింది. కరోనా ప్రభావం ఐపీఎల్‌పై బాగా పడింది. దీంతో రాజ్‌కుంద్ర రూట్‌ మార్చాడట. వెబ్‌ సిరీస్‌ అవకాశాలు ఎరచూసి అమ్మాయిలకు ఎరవేయడం, వారిచేత పోర్న్, సెమీ పోర్న్ వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ని సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.
undefined
వెబ్‌ సిరీస్‌ల పేరుతో పోర్న్‌, సెమీ పోర్న్‌ కంటెంట్‌ను తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్‌ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడంటూ ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో సోమవారం సాయంత్రం విచారణ పేరిట బైకుల్లాలోని తమ ఆఫీస్‌కు రప్పించుకున్న ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈ మొత్తం పోర్న్‌ మాఫియాకు రాజ్‌ కుంద్రానే సూత్రధారి అని ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత​ నగ్రాలే నిర్ధారించారు. ఈ క్రమంలో రాజ్‌ కుంద్రా నుంచి ముంబై పోలీసులు విలువైన, ఆసక్తికర సమాచారాన్ని రాబట్టారట.
undefined
ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఉత్తర ముంబై మలాద్‌లో మదా ఐల్యాండ్‌లోని ఓ భవనంలో బూతు సినిమాలు తీస్తున్న ఓ ముఠాను ముంబై ప్రాపర్టీ సెల్‌(స్పెషల్‌ పోలీస్‌) అరెస్ట్‌ చేసింది. మొత్తం 9 మందిలో నటి కమ్‌ మోడల్స్‌ గెహానా వశిష్ఠ్‌, రోవా ఖాన్‌ కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో యూకే ప్రొడక్షన్‌ కంపెనీ కెన్‌రిన్‌ ఉండడం, దానికి ఉమేశ్‌ కామత్‌ హెడ్‌ కావడం, ఉమేశ్‌ ఇదివరకు కుంద్రా దగ్గర పని చేయడంతో కుంద్రాపై ప్రాపర్టీ సెల్‌ విభాగం ఇన్‌స్పెక్టర్‌ కేదార్‌ పవార్‌ ఫోకస్‌ పెట్టాడు.
undefined
ఈ క్రమంలో గతంలో ఓసారి కుంద్రాని పోలీసులు ప్రశ్నించారు కూడా. ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించాకే రాజ్‌ కుంద్రాని సోమవారం అరెస్ట్‌ చేసినట్లు ముంబై కమిషనర్‌ తెలిపారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం కుంద్రాను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. లైవ్‌ స్ట్రీమింగ్‌ యాప్‌లు, ఐపీఎల్‌లు పెద్దగా కలిసి రాకపోవడంతో తప్పుడు దారిలో సంపాదన కోసమే ఆయన ఈ పని చేసినట్లు ముంబై పోలీసులు నిర్ధారించుకున్నారు.
undefined
సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రాజ్‌ కుంద్రా యువతులను తన మీడియేటర్ల ద్వారా ట్రాప్‌లోకి దించాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు తమతో అగ్రిమెంట్లు చేయించుకున్నాక బలవంతంగా పోర్న్‌ సినిమాలు తీయించినట్లు బాధితుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు పోలీసులు. హాట్‌షాట్స్‌, హాట్‌హిట్‌మూవీస్‌ లాంటి బీ, సీ గ్రేడ్‌ యాప్స్‌ కొన్నింటిలో ఆ వీడియోలను అప్‌లోడ్‌ చేయడం, సోషల్‌ మీడియా అకౌంట్‌లలో సైతం వాటిని పోస్ట్‌ చేయాలని సదరు నటీమణులను ఒత్తిడి చేయడం, ట్విటర్‌ పేజీలతో ప్రమోట్‌ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసులు నిర్ధారించారు.
undefined
ఈ సందర్భంగా రాజ్‌కుంద్రా ఎదిగిన విధానం చూస్తే అందరికి ఆశ్చర్యానికి షాక్‌కి గురి చేస్తుంది. పంజాబీ కుటుంబానికి చెందిన రాజ్‌ కుంద్రా స్వస్థలం లూథియానా. చిన్నతనంలోనే అతని ఫ్యామిలీ లండన్‌కు వలస వెళ్లింది. కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్‌గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. 18 ఏళ్ల వయసులో దుబాయ్‌ అక్కడి నుంచి నేపాల్‌ వెళ్లిన కుంద్రా.. శాలువాల బిజినెస్‌ స్టార్ట్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత వాటిని బ్రిటన్‌కు చెందిన ఫ్యాషన్‌ హౌజ్‌ కంపెనీలకు విక్రయించి బాగా సంపాదించాడు. కోట్లు కూడబెట్టుకున్నాడు. అంతేకాదు ఏకంగా 2004లో బ్రిటిష్‌-ఏషియన్‌ రిచ్చెస్ట్‌ పర్సన్‌ లిస్ట్‌లో 198వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు.
undefined
2007కి తిరిగి దుబాయ్‌కు వెళ్లి.. కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌లో అడుగుపెట్టాడు. ఆ టైంలోనే బాలీవుడ్‌ సినిమాలకు ఫైనాన్సింగ్‌ మొదలుపెట్టాడు. సంజయ్‌ దత్‌, అక్షయ్‌ కుమార్‌ లాంటి స్టార్ల పరిచయాలతో పలు స్పోర్ట్స్‌ బిజినెస్‌, లైవ్‌-బ్రాడ్‌కాస్ట్‌, గేమింగ్‌ సంబంధిత వ్యవహారాలతో లెక్కలేనంత సంపాదించాడు.
undefined
2009లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు(కుంద్రాకు రెండో వివాహం). ఆపై ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్‌-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. 2019లో రాజ్‌ కుంద్రాకు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద అవార్డు కూడా దక్కింది. ఇక తనకు సంబంధించిన న్యూడ్‌ ఫొటోలు, వీడియోలను తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే సైతం రాజ్‌ కుంద్రాపై ఓ దావా వేయగా, ఆ కేసు బాంబే హైకోర్టులో నడుస్తోంది కూడా.
undefined
ఈ నేపథ్యంలో ఏకంగా ఇప్పుడు పోర్న్ వీడియోల కేసులో ఆయనే ప్రధాన సూత్రదారి అని తెలియడంతో ఇప్పుడీ కేసు బాలీవుడ్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతుంది. శిల్పా శెట్టి దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నటి కావడం, రాజ్‌కుంద్రా ఐపీఎల్‌ మ్యాచ్‌లతో పాపులర్‌ కావడం ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
undefined
click me!