శర్వానంద్ కి పెళ్లి కుదిరింది.. అమ్మాయి ఎవరో తెలుసా ?

First Published Jan 5, 2023, 10:34 AM IST

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం శర్వానంద్ వయసు 38 ఏళ్ళు. థర్టీ ప్లస్ ఉండి కూడా పెళ్లి చేసుకోని బ్యాచిలర్స్ టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు.

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం శర్వానంద్ వయసు 38 ఏళ్ళు. థర్టీ ప్లస్ ఉండి కూడా పెళ్లి చేసుకోని బ్యాచిలర్స్ టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. అయితే ఇన్నాళ్లకు శర్వా తన బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి చెప్పబోతున్నాడు. కొత్త సంవత్సరంలో ఈ యంగ్ హీరోకి పెళ్లి కుదిరింది. 

Sharwanand

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతితో శర్వానంద్ కి కుటుంబ సభ్యులు పెళ్లి కుదిర్చారు. ఆ యువతి రెడ్డి సామజిక వర్గానికి చెందిన అమ్మాయిగా తెలుస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఆమె కొన్ని నెలల నుంచి హైదరాబాద్ లోనే ఉంటోందట. 

ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని ఈ పెళ్లి పిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ముహూర్తాలు చూసుకుని ఎంగజ్మెంట్, వివాహం జరగనున్నాయి. మొత్తంగా 2023లో శర్వానంద్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. 

కొన్ని వారాల క్రితం శర్వానంద్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య శర్వాని పెళ్ళెప్పుడు అని ప్రశ్నించగా.. ప్రభాస్ పెళ్లి తర్వాత అని సరదాగా బదులిచ్చాడు. 

ఇంకా ప్రభాస్ పెళ్లి ఊసే వినిపించడం లేదు. కానీ శర్వానంద్ పెళ్ళికి రెడీ అవుతున్నాడు. ఇది శర్వా అభిమానులందరికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. శర్వానంద్ చివరగా ఒకే ఒక జీవితం అనే చిత్రంలో నటించారు. టైం ట్రావెల్, మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 

శర్వానంద్ తన నెక్స్ట్ మూవీని ఇంకా అనౌన్స్ చేయలేదు. బహుశా పెళ్లి తంతు ముగిసేవరకు నెక్స్ట్ ప్రాజెక్టుకి సైన్ చేయడమో. శర్వానంద్ కెరీర్ లో రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు లాంటి బిగ్ హిట్స్ ఉన్నాయి. 

click me!