రెండో పెళ్లి చేసుకోవాలా వద్దా?... ఆలోచనలో పడ్డ స్టార్ యాంకర్ అనసూయ, వరుడు ఎవరంటే? 

First Published Oct 7, 2022, 5:19 PM IST

యాంకర్ అనసూయకు రెండో పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ఈ ప్రపోజల్ పై ఆమె స్పందించారు.ఇక అనసూయ సమాధానం వైరల్ గా మారింది. 
 

Anasuya Bharadwaj

చూపు తిప్పుకోలేని గ్లామర్, రోజుకు లక్షల్లో సంపాదన. ఎవరు మాత్రం అనసూయను సొంతం చేసుకోవాలని అనుకోరు. పెళ్ళై ఇద్దరు పిల్లలున్నా అనసూయకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. నన్ను వివాహం చేసుకుంటావా అంటూ అనేక మంది పురుష పుంగవులు ఎగబడుతున్నారు.

Anasuya Bharadwaj

అనసూయ సోషల్ మీడియా ఫ్రీక్ అన్న విషయం తెలిసిందే. గ్లామరస్ ఫోటో షూట్స్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్. ఇంస్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తారు. ఆన్లైన్ లో వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటారు. 
 

ఇటీవల అనసూయ మరోసారి అభిమానులతో సోషల్ మీడియా చిట్ చాట్ లో పాల్గొన్నారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే ఫ్యాన్స్ లో ఒక వ్యక్తి నుండి ఆమెకు చిలిపి ప్రశ్న ఎదురైంది. అతడు అనసూయను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ''నన్ను పెళ్లి చేసుకుంటావా అని చాలా సార్లు అడిగాను. మీ నుండి సమాధానం మాత్రం లేదు'' అని ప్రశ్నించాడు. 

Anasuya Bharadwaj

సాధారణంగా సెలెబ్రిటీలు ఈ తరహా ప్రశ్నలు లైట్ తీసుకుంటారు. అనసూయ అందరిలాంటి అమ్మాయి కాదు కదా.. తనదైన శైలిలో స్పందించారు. ఆలోచిస్తున్న ఫోజులో ఉన్న తన ఫోటో, ఒక ఎమోజీ సమాధానంగా పోస్ట్ చేసింది. అనసూయ సమాధానం నీ మ్యారేజ్ ప్రపోజల్ గురించి నేను ఆలోచిస్తా అన్నట్లుంది. తన ప్రశ్నకు సమాధానం రావడంతో సదరు నెటిజెన్ నిజంగా షాకై ఉంటాడు. 
ఇక అనసూయ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఆమె నటిగా, యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే యాంకరింగ్ కూడా పక్కన పెట్టారు. నటిగా ఆఫర్స్ వస్తుండగా అటువైపు ఫోకస్ పెట్టారు. లేటెస్ట్ రిలీజ్ గాడ్ ఫాదర్ మూవీలో అనసూయ ఓ రోల్ చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేదని మెగా ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

ఇక అనసూయ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఆమె నటిగా, యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే యాంకరింగ్ కూడా పక్కన పెట్టారు. నటిగా ఆఫర్స్ వస్తుండగా అటువైపు ఫోకస్ పెట్టారు. లేటెస్ట్ రిలీజ్ గాడ్ ఫాదర్ మూవీలో అనసూయ ఓ రోల్ చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేదని మెగా ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 


బిజీ షెడ్యూల్స్ కారణంగానే గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయానని అనసూయ వివరణ ఇచ్చారు. అనసూయ సినిమాలు, సిరీస్లు చేస్తూ ఊపిరి సలపని బిజీలో ఉన్నారు. 
 

click me!