సావిత్రి నుండి సిల్క్ స్మిత వరకు... దుర్భర స్థితిలో తారల మరణాలు

First Published Dec 9, 2020, 11:46 AM IST

సినిమా ఒక మాయ ప్రపంచం... తెరపై మెరిసే నటుల జీవితాలు కూడా కనిపించినంత అందంగా ఏమీ ఉండవు. కెరీర్ సాగినంత కాలం ఫేమ్, స్టేటస్, విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఒక్కసారి ఫేడవుట్ అయితే పట్టించుకొనే నాధుడే ఉండదు. వెండితెరపై తిరుగులేని స్టార్డం అనుభవించి జీవిత చరమాంకంలో దుర్భర పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచిన నటులు అనేక మంది...వారెవరో ఒకసారి చూద్దాం.. 

గ్లామరస్ హీరోయిన్ గా 70లలో బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించారుహీరోయిన్ పర్వీన్ బాబీ. ఎంతో స్టార్ డమ్ అనుభవించిన పర్వీన్మానసిక వ్యాధికి గురయ్యారు. దీనితో అమెరికాలోచాలా కాలం మెంటల్ హాస్పటిల్ లో గడిపారు. చివరి రోజుల్లోపర్వీన్ఒంటరిగా మరణించారు. కాలికి గాయం కావడంతోనడవలేని స్థితిలో ఆమె మరణించారు. ఆమె మరణించినమూడురోజుల తరువాత ముంబైలోనిఅపార్ట్మెంట్ లో శవం స్వాధీనం చేసుకున్నారు. మూడురోజులుగా ఆమె ఏమి తినలేదనిపోస్ట్మార్టంలో తేలింది. 2005లో పర్వీన్ బాబీ మరణించారు.
undefined
సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ గా ఎదిగిందిసావిత్రి. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ స్టార్ గా సావిత్రిని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటిస్టార్స్ కి మించిన ఇమేజ్ సొంతం చేసుకున్న సావిత్రి, లెక్కలేనంత ఆస్థిని సంపాదించారు. దాన గుణం, నమ్మినవారుమోసం చేయడంవలన, ముందుకు బానిసై, చివరి రోజుల్లో కడు పేదరికంలో మరణించారు. తొమ్మిది నెలలు కోమాలో ఉన్న సావిత్రి 1981లో మరణించారు.
undefined
బాలీవుడ్ లో మీనా కుమారినిట్రాజెడీక్వీన్ అంటారు. వెండితెరపై తిరుగులేని స్టార్ డమ్ అనుభవించిన ఆమె చివరి రోజుల్లోహాస్పిటల్ బిల్స్ కూడా కట్టలేని స్థితిలో మరణించారు. మద్యానికిమీనాకుమారిబానిసగా మారారు. దీనితో ఆమె లివర్ పూర్తిగా చెడిపోవడం జరిగింది.
undefined
శృంగార తారగాసౌత్ ఇండియాను ఏలిన సిల్క్ స్మిత మరణం కూడా విషాదమే. 1996లో సిల్క్ స్మితచెన్నైలోని తన నివాసంలోఆత్మహత్య చేసుకొని మరణించారు. ఆమె మరణానికి కారణం కెరీర్ మసక బారడమే అని సూసైడ్ నోట్ లో తెలిపారు.
undefined
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత గురు దత్అధికంగా ఆల్కహాల్ మరియు నిద్ర మాత్రలు తీసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో విభేదాలు, ఒంటరితనం గురు దత్ని ఆత్మహత్యకు పురిగొల్పాయి.
undefined
సీనియర్ నటి అచల సచ్దేవ్ పుణేలోఅత్యంత దయనీయ స్థితిలో మరణించారు. అమెరికాలోఉంటున్న కొడుకు, ముంబైలోని కూతురు తనను నిర్లక్ష్యం చేయడంతో, మనో వేదనతోఆమె మరణించడం జరిగింది.
undefined
225పైగా సినిమాలలో నటించినబాలీవుడ్ సీనియర్ నటుడు ఏకే హంగల్కడు పేదరికంలో మరణించారు. అనేక సక్సెస్ ఫుల్ చిత్రాలలో నటించిన హంగల్2012లో మరణించే నాటికి హాస్పిటల్ బిల్స్ కూడా కట్టలేని స్థితికి చేరుకున్నారు.
undefined
1967లో విడుదలైన హమ్రాజ్ మూవీతో వెండితెరకు పరిచమైనహీరోయిన్విమి, అతి తక్కువ కాలంలోస్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే భర్త శివ్ అగర్వాల్ తో విడాకుల తరువాత ఆమె జీవితం తలకిందులైంది. 1977లో ఆమె మరణించగా , చివరి రోజులు నానావతి హాస్పిటల్ లోని జనరల్ వార్డ్ లో గడిపారట.
undefined
నటుడు భరత్భూషణ్ జీవితం విషాదాలమయం. కోట్లఆస్థి కలిగిన భరత్ జూదం వ్యసనం వలన అన్నీ కోల్పోయాడు. తన ఆస్తులన్నీ జూదం కోసం అమ్ముకోవడం జరిగింది. తన చిన్నప్పుడే తల్లి చనిపోగా, భార్య కాన్పు సమయంలో మరణించారు. తన కూతురు పోలియో భారినపడ్డారు. భరత్ జీవితం కూడా విషాదం మధ్య ముగిసింది.
undefined
నటుడు భగవాన్ దాదాబంగ్లా, కార్లతోవిలాసవంతమైన జీవితం గడిపారు . చివరి రోజుల్లో అవేమి ఆయన దగ్గరలేరు. ఒంటరిగా పేదరికంలోభగవాన్ దాదా కన్నుమూశారు.
undefined
click me!