Devatha: ఆదిత్య రుక్మిణిని చూసి షాకైన సత్య.. ఇద్దరి అనుబంధం చూసి కన్నీళ్లు!

First Published Oct 6, 2022, 11:04 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 6వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..ఆదిత్య, పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మీరు ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి అని ఆదిత్య అనగా,మేము ఎప్పుడూ ఆనందంగానే ఉంటాము సారు కానీ అవ్వ అలాగ అయ్యేసరికి మాకు బాధ వచ్చింది నేను పెద్దయ్యాక డాక్టర్ అయ్యి అవ్వ లాంటి వాళ్ళకి నయం చేస్తానని అంటుంది. దానికి చిన్మయి నవ్వుతూ, మొన్నే కదా నువ్వు ఆఫీసర్ సార్ లాగా కలెక్టర్ అవుతా అన్నావు మళ్లీ మాట మార్చేస్తున్నావా అని అనగా ఆదిత్య, అవును కదా నువ్వు కలెక్టర్ అవుతావు అన్నావు కదా అలా ప్రతిసారి మాట మార్చకూడదు.

నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో దానిమీద నిలబడాలి అని అంటాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు నవ్వుకుంటూ ఉండగా అదే సమయంలో రుక్మిణి అక్కడికి వచ్చి, మాధవ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే అమ్మకు ప్రమాదం ఉంటుంది. అమ్మకు ప్రమాదం తెలిసినా సరే నేను వెళ్ళిపోతే నాకు ఇంత జీవితాన్ని ఇచ్చిన అమ్మకు విలువ ఇవ్వలేనట్టు ఉంటుంది. కనుక నేను ఎలాగైనా ఇక్కడే ఉండాలి కానీ పెనిమిటి ఇక్కడ ఉంటే ఆ మాధవ్ గాడు ఏం చేసైనా పెనిమిటి మీద నిందపడేలా చేస్తాడు.
 

 కనుక  పెనిమిటి నీఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పాలి అని అక్కడికి వెళుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇద్దరిని వెళ్లి పడుకోండి సమయం అవుతుంది కదా అని చెప్తుంది రుక్మిణి. అదే సమయంలో సత్య అక్కడికి వస్తుంది. ఏంటి మాధవ్ ఇక్కడికి పిలిచావు? ఈ ఫోటోలు ఏంటి అని అనగా, ఆదిత్య నీకు ఏం చెప్పి వచ్చాడో తెలియదు అమ్మ. కానీ ఇక్కడే ఉన్నాడు కుటుంబం అందరిని తనే స్వయంగా ఇక్కడికి తీసుకొని వచ్చాడు.పిల్లల కోసం వచ్చాడు అని అనుకున్నాను కానీ పిల్లల కోసం కాదు అని చెప్పి రుక్మిణి ,ఆదిత్య మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళని చూపిస్తాడు.
 

అప్పుడు ఆదిత్య రుక్మిణితో, నేను సత్యకు చెప్పకుండా వచ్చాను అయినా పర్వాలేదు అని అంటాడు. దానికి రుక్మిణి,  అలా కాదు పెనిమిటి సత్య బాధపడుతుంది సత్యమ్మకు తెలియకుండా నువ్వు ఇలా రావడం మంచిది కాదు అని అంటుంది. అప్పుడు సత్య చ్చీ!అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆదిత్య సరే అయితే నేను వెళ్తాను నీ ఇష్టం అని చెప్తాడు. అప్పుడు మాధవ్, చూసావా రాద, నేను నీ చేతే వాడిని ఇంటికి పంపించేలా చేశాను, ఇప్పుడు ఇంటికి  వెళ్ళాక మరో సర్ప్రైజ్ ఉంటుంది అని అనుకుంటాడు.
 

 ఆ తర్వాత రోజు రుక్మిణి ఆ నర్స్ దగ్గరికి వెళ్లి చంప మీద కొట్టి,మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారా?డబ్బు ఇస్తానని చెప్తే వాడి మాటలు విని జానకమ్మకి ఎందుకు తప్పుడు మందులు ఇచ్చావు? నా పెనిమిటి ఆఫీసర్ ఈ విషయం ఆయనకి చెప్తే వెళ్లి జైల్లో కూర్చోబెడతాడు అని అనగా, క్షమించండి మేడం డబ్బుకి ఆశ పడి ఇలా చేశాను అని రుక్మిణి చెయ్యి పట్టుకుని ప్రాధేయపడుతుంది ఆ నర్స్.ఇంతలో డాక్టర్ వచ్చి ఏమైంది అని అనగా, జరిగిన విషయం అంటా రుక్మిణి చెప్తుంది.

అప్పుడు డాక్టర్, మా చికిత్సలయానికి చెడ్డ పేరు తెచ్చిన ఈ నర్స్ ని ఇప్పుడే తీసేస్తున్నాను అని అనగా, వద్దు ఈవిడని తీసేస్తే ఆ మాధవ్ ఇంకొకరిని డబ్బుతో కొనేస్తాడు.ఈవిడను విడిచిపెట్టండి అని చెప్పి, ఆ నర్స్ తో, నిన్ను విడిచి పెడుతున్నాను కదా అని ఈ విషయమంరా మాధవ్ కి చెప్తే బాగోదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది రుక్మిణి. ఆ తర్వాత ఆ నర్స్ మందులు జానకమ్మకి ఇస్తున్నప్పుడు మాధవ్, అంతా బానే ఉన్నది కదా చెప్పినట్టే చేస్తున్నావ్ కదా! ఇలాగే చేస్తే ప్రతిరోజు డబ్బులు ఇస్తాను అని అనగా, రుక్మిణి ఈ విషయం మాధవ్ కి చెప్పొద్దు అన్న సంఘటన గుర్తు తెచ్చుకున్న నర్స్ అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నాను సార్.
 

ఏ తప్పు జరగడం లేదు అని అంటుంది.తర్వాత రుక్మిణి దగ్గరుండి ఆ నర్స్ చేత జానకమ్మ కి మందులు ఇప్పిస్తూ ఉంటుంది. మరోవైపు సత్య ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమైంది అని అడగక ఏమి చెప్పదు అదే సమయంలో ఆదిత్య ఇంటికి వస్తాడు. ట్రిప్ ఎలా గడిచింది ఆదిత్య బాగుందా అని సత్య అనగా, బాగుంది సత్య అని ఆదిత్య అంటాడు. ఆకలేస్తుందా అని సత్య అడుగుతుంది.లేదు అని ఆదిత్య అనగా,అక్కడ బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు ఆకలి కూడా  వేయడం లేదు అని అంటుంది సత్య.
 

ఏ తప్పు జరగడం లేదు అని అంటుంది.తర్వాత రుక్మిణి దగ్గరుండి ఆ నర్స్ చేత జానకమ్మ కి మందులు ఇప్పిస్తూ ఉంటుంది. మరోవైపు సత్య ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమైంది అని అడగక ఏమి చెప్పదు అదే సమయంలో ఆదిత్య ఇంటికి వస్తాడు. ట్రిప్ ఎలా గడిచింది ఆదిత్య బాగుందా అని సత్య అనగా, బాగుంది సత్య అని ఆదిత్య అంటాడు. ఆకలేస్తుందా అని సత్య అడుగుతుంది.లేదు అని ఆదిత్య అనగా,అక్కడ బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు ఆకలి కూడా  వేయడం లేదు అని అంటుంది సత్య.
 

click me!