షూటింగ్ లో క్యూట్ గా కనిపించే సమంత ఇంటిదగ్గర అమ్మగా మాత్రం చాలా సీరియస్ అట

First Published Mar 17, 2021, 2:37 PM IST


హోస్టుగా సామ్ జామ్ అంటూ స్టార్స్ అందరినీ ఓ ఆటాడుకుంది సమంత. ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ టాక్ షోలో చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రానా వంటి టాప్ స్టార్స్ పాల్గొని సమంత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 
 

జాను సినిమా తరువాత మరో సినిమా షూటింగ్ లో పాల్గొనని సమంత... చాలా కాలం తరువాత షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో సమంత నటిస్తుండగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.
undefined
హైదరాబాద్ లో చిత్ర ప్రముఖుల మధ్య శాకుంతలం మూవీ షూటింగ్ లాంఛ్ ప్రోగ్రాం జరిగింది. శాకుంతలంలో సమంతకు జోడిగా నటిస్తున్న మోహన్ దేవ్ తో పాటు నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, దర్శకుడు గుణశేఖర్ ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.
undefined
కాగా సమంత ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఆసక్తికర ఫోటోలు పంచుకున్నారు.  షూటింగ్ లో ఇలా... ఇంటి దగ్గర కోప్పడుతున్న అమ్మగా ఇలా అంటూ రెండు ఫొటోలు పోస్ట్ చేశారు.
undefined
షూటింగ్ సమయంలో నవ్వులు కురిపిస్తూ ఆహ్లదంగా ఉండే సమంత, ఇంటి దగ్గర కొడుకు హ్యాష్ తప్పు చేస్తే కోప్పడుతూ సీరియస్ మదర్ లా కనిపిస్తారట.

samantha

సమంత పిల్లలు కనకుండా తల్లి ఎలా అయ్యారనే సందేహం మీకు రావచ్చు. అయితే తన పెట్ డాగ్ హ్యాష్ ని సమంత బిడ్డలా ఫీలవుతున్నారు. చెప్పిన మాట వినకుండా అల్లరి చేస్తే తన హ్యాష్ ని అమ్మగా దండిస్తారట సమంత.

samantha

సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉండే సమంత ప్రతి విషయం ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. తన దిన చర్యతో పాటు పర్సనల్ విషయాలు కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తారు.
undefined
లాక్ డౌన్ సమయంలో ఇంటిలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేసుకోవచ్చో సమంత తాను తెలుసుకోని, ఫ్యాన్స్ కి తెలియజేశారు.
undefined
ఇక ఫిట్నెస్ ఫ్రీక్ అయిన ఆమె వ్యాయామం, ఆహారం విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.
undefined
అలాగే సమంతకు ఆధ్యాత్మిక చింతన కూడా చాల ఎక్కువ... ఈనెలలో జరిగిన శివరాత్రి జాగరంలో పాల్గొన్న సమంత, ఫ్రెండ్స్ లక్ష్మీ మంచు, రకుల్ తో కలిసి డివోషనల్ ట్రిప్ లో పాల్గొన్నారు.
undefined
click me!