తీవ్ర విషాదం.. జిమ్ చేస్తూ సల్మాన్ ఖాన్ డూప్ మృతి.. కండల వీరుడు ఎమోషనల్ పోస్ట్

First Published Oct 1, 2022, 12:15 PM IST

చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ కీలక వ్యక్తి ఊహించని విధంగా మృత్యువాత పడ్డారు. అతడు ఎవరో కాదు.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఎన్నో చిత్రాల్లో డూప్ గా పనిచేస్తూ వచ్చిన సాగర్ పాండే.

చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ కీలక వ్యక్తి ఊహించని విధంగా మృత్యువాత పడ్డారు. అతడు ఎవరో కాదు.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఎన్నో చిత్రాల్లో డూప్ గా పనిచేస్తూ వచ్చిన సాగర్ పాండే. సాగర్ పాండే కి ఇంకా 50 ఏళ్ల వయసు కూడా పూర్తి కాలేదు. చిన్న వయసులోనే ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. 

జిమ్ చేస్తుండగా సెప్టెంబర్ 30న సాగర్ కుప్ప కూలినట్లు తెలుస్తోంది. దీనితో అతడిని పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాగర్ గుండెపోటుతో  మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సాగర్ మరణవార్త తెలియగానే సల్మాన్ ఖాన్ షాక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సాగర్ కి నివాళి అర్పిస్తూ సల్మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

'మీరు నాతో ఉన్నన్ని రోజులు నా హృదయం సంతోషానికి అడ్డాగా మారింది. మీ ఆత్మకి శాంతి చేకూరాలి. థాంక్యూ సాగర్ భాయ్' అని సల్మాన్ ఖాన్ పోస్ట్ పోస్ట్ చేశారు. భజరంగి భాయీజాన్ సెట్స్ లో సాగర్ తో దిగిన ఫోటోని సల్మాన్ అభిమానులతో పంచుకున్నారు. 

దాదాపు 50 చిత్రాలకు పైగా సాగర్.. సల్మాన్ కి బాడీ డబుల్ గా పనిచేశారు. స్టంట్ మ్యాన్ గా కూడా గుర్తింపు పొందారు. అనుపమ్ ఖేర్ లాంటి లెజెండ్రీ సెలెబ్రిటీలు కూడా సాగర్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సాగర్ మృతి విషయాన్ని మొదట మీడియాకి తెలియజేసిన వ్యక్తి షారుఖ్ ఖాన్ బాడీ డబుల్ ప్రశాంత్ వాల్డె. 

ప్రశాంత్ మాట్లాడుతూ.. ఇది జీర్జించుకోలేని విషయం. సాగర్ వయసు 45 నుంచి 50 మధ్యలో ఉంటుంది. చాలా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటాడు. అలాంటి వ్యక్తికి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు అని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కూడా ఆగష్టు లో జిమ్ చేస్తూ కుప్పకూలారు. ఆయన చికిత్స పొందుతూ సెప్టెంబర్ లో మరణించారు. 

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా జిమ్ వర్కౌట్స్ చేస్తూనే గుండెపోటుతో మరణించారు. సెలెబ్రిటీలని జిమ్ కసరత్తులు కలవరపెడుతున్నాయి. జిమ్ చేసే సమయంలో జాగ్రత్తలు అవసరం అంటూ నిపుణులు సూచిస్తున్నారు. 

click me!