హీరోయిన్లుగా సాయిపల్లవి, శివాత్మిక, జాన్వీ కపూర్‌, కృతి సనన్‌ సిస్టర్స్ .. సిల్వర్‌ స్క్రీన్‌ రచ్చ రచ్చే

First Published Jun 17, 2021, 9:48 PM IST

స్టార్ హీరోయిన్స్ సాయిపల్లవి, శివాత్మిక రాజశేఖర్‌, కృతి సనన్‌, జాన్వీ కపూర్‌, అనన్య పాండే ఈ బ్యూటీస్‌ అందాల సిస్టర్స్ ఇప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అక్కల దారిలో అందాలతో, నటనతో మెస్మరైజ్‌ చేయబోతున్నారు. 

సాయిపల్లవి స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలతో దూసుకుపోతుంది. అద్భుతమైన నటన, డాన్సులతో ఫిదా చేస్తున్న ఈ అమ్మడికి సిస్టర్‌ పూజా కన్నన్‌ ఉన్నారు. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందట.
undefined
పూజా కన్నన్‌ తమిళంలో దర్శకుడు శివ తెరకెక్కించబోతున్న ఓ సినిమా ద్వారా హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం కాబోతుందట. అయితే తనకు అక్కలాగా హద్లుల్లేవని, గ్లామర్‌కి ఓకే అని ఎంట్రీకి ముందే చెప్పి షాక్‌ ఇచ్చింది.
undefined
మరోవైపు తెలుగులో స్టార్‌ హీరో రాజశేఖర్‌, జీవితల తనయలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. చిన్న కుమార్తె శివాత్మిక ఇప్పటికే `దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై విపరీతమైన క్రేజ్‌ని, ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ అమ్మడికి సిస్టర్‌ శివానీ ఉన్న విషయం తెలిసిందే.
undefined
నిజానికి అక్క శివానీ ఎంట్రీనే ముందు జరగాల్సి ఉంది. `టూ స్టేట్స్ ` రీమేక్‌ని అనౌన్స్ చేశారు. కొంత షూటింగ్‌ కూడా జరిపారు. ఏంజరిగిందో ఏమో సినిమా ఆగిపోయింది. దీంతో చెల్లి శివాత్మిక ఎంట్రీ జరిగింది. ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది.
undefined
ఇప్పుడు అక్క శివానీ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఆమె ప్రస్తుతం `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` చిత్రంలో అరుణ్‌ ఆదితో కలిసి నటిస్తుంది. దీనికి కె వి గుహన్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
undefined
వీరితోపాటు బాలీవుడ్‌కి చెందిన హీరోయిన్ల చెల్లెల్లు హీరోయిన్ గా ఎంట్రీకి ప్లాన్‌ చేస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవికి ఇద్దరు తనయలు జాన్వీకపూర్‌, ఖుషీ కపూర్‌. ఇప్పటికే జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
undefined
మరోవైపు ఇప్పుడు చెల్లి ఖుషీ కపూర్‌ ని హీరోయిన్‌గా ఎంట్రీ కోసం ప్లాన్‌ చేస్తున్నారు. ఫాదర్‌, నిర్మాత బోనీ కపూర్‌ ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌ చిత్రంతోనా, లేక టాలీవుడ్‌ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలా? అనే ఆలోచనలో ఉన్నారు.
undefined
అలాగే కృతి సనన్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ప్రభాస్‌ సరసన `ఆదిపురుష్‌`లో సీతగా నటిస్తున్న ఈ అమ్మడికి సిస్టర్‌ నుపూర్‌ సనన్‌ ఉంది.యూట్యూబ్‌ స్టార్‌గా ఉన్న ఈ బ్యూటీ కూడా ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందట. గతంలోనూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. నటిగా ఇప్పటికే పలు యూట్యూబ్‌ వీడియోలు, షార్ట్ ఫిల్మ్ చేసిందీ భామ.
undefined
మరోవైపు విజయ్‌ దేవరకొండ సరసన `లైగర్‌` చిత్రంలో నటిస్తున్న అనన్య పాండే కి కూడా సిస్టర్‌ ఉంది. అలనే పాండే ఇప్పటికే బాయ్‌ఫ్రెండ్‌ని మెయింటేన్‌ చేస్తూ సంచలనంగా మారింది. మరోవైపు ఈ బ్యూటీని కూడా సినిమాల్లోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట.
undefined
మరి హీరోయిన్లు గా రాణిస్తున్న సాయిపల్లవి, కృతి సనన్‌, శివాత్మిక, జాన్వీ కపూర్, అనన్య పాండేల మాదిరిగా వారి ముద్దుల చెల్లెల్లు రాణిస్తారా? అన్నది చూడాలి.
undefined
click me!