ప్రియుడిని కన్ఫమ్‌ చేసిన `ఆర్‌ఎక్స్ 100` బ్యూటీ.. బర్త్ డే లవ్‌(ఫోటో వైరల్‌)

First Published Dec 5, 2020, 3:03 PM IST

`ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో టాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యింది పాయల్ రాజ్‌పుత్‌. ఈ తెల్లతోలు పిల్ల టాలీవుడ్‌లో హాట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. తాజాగా తన బర్త్‌ డే స్పెషల్‌గా తన ప్రియుడిని కన్ఫమ్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోస్‌ వైరల్‌ అవుతున్నాయి. 
 

`ఆర్‌ఎక్స్ 100`లో హాట్‌ అందాలను ఆరబోసి కుర్రకారు కలల రాణిగా నిలిచింది పాయల్‌. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది.
undefined
శనివారం ఈ బ్యూటీ తన పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు, నటుడు సౌరబ్‌ దింగ్రా ట్విట్టర్‌ వేదికగా విషెస్‌ తెలిపారు. అంతేకాదు `హ్యాపీ బర్త్ డే మై లవ్‌` అని పేర్కొన్నాడు.
undefined
దీనికి పాయల్‌ కూడా రియాక్ట్ అవుతూ, లవ్‌ సింబల్స్ పెట్టడం విశేషం. అయితే గతంలో సౌరబ్‌కి పుట్టిన రోజు కూడా పాయల్ విషెస్‌ తెలిపింది.
undefined
వీరిద్దరు రహస్యంగా కలిసి చాలా రోజులుగా డేటింగ్‌ చేస్తున్నారని బాలీవుడ్‌ మీడియా రాసుకొచ్చింది. అందుకు తగ్గట్టే వీరి ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా మరోసారి ఇది నిరూపితమైంది.
undefined
ఇక సౌరబ్‌ దింగ్రా హిందీలో నటుడిగా, సింగర్ గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారని సమాచారం.
undefined
`ఆర్‌ఎక్స్ 100`తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ `సీత` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసి ఓ ఊపు ఊపింది.
undefined
ఆ తర్వాత `ఆర్‌డీఎక్స్ లవ్‌`, `డిస్కో రాజా`, `వెంకీమామ` చిత్రాల్లో నటించి కనువిందు చేసింది. అయితే తన పాపులారిటీకి తగ్గ ఇమేజ్‌ ఈ బ్యూటీకి రాకపోవడం విచారకరం.
undefined
తాజాగా ఈ అమ్మడు `అనగనగా ఓ అతిథి` వెబ్‌ మూవీలో మెరిసి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఇది పాయల్‌కి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.
undefined
ప్రస్తుతం ఈ అమ్మడు పలు క్రేజీ ఆఫర్స్ దక్కించుకుని ముందుకుసాగుతుంది. ఇక నేడు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఈ బ్యూటీ తన లవ్‌ని కన్ఫమ్‌ చేసి అభిమానులను నిరాశపరిచిందనే చెప్పాలి.
undefined
click me!