ట్రాన్స్పరెంట్ శారీలో చిలసౌ బ్యూటీ.. నాభి అందాలతో కాక రేపుతోందిగా..

First Published Oct 4, 2021, 5:14 PM IST

యంగ్ హీరోయిన్ రుహాని శర్మ చిలసౌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటనతో మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ.

యంగ్ హీరోయిన్ రుహాని శర్మ చిలసౌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటనతో మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. చిలసౌ చిత్ర నేషనల్ అవార్డు కూడా దక్కించుకోవడంతో రుహానికి ఇంకాస్త క్రేజ్ పెరిగింది. 

ప్రస్తుతం రుహాని సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. లేటెస్ట్ గా రుహాని శర్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ట్రాన్స్పరెంట్ శారీ పిక్స్ యువతని ఆకర్షిస్తున్నాయి. 

చీర చాటిన దాగి ఉన్న ఆమె నాభి సొగసు మతిపోగొట్టే విధంగా ఉంది. ఆమె శారీ లుక్ కూడా స్టన్నింగ్ అనిపించేలా ఉంది. కలర్ ఫుల్ గా ఉన్న బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

నాజూకు అందాలతో ఆకట్టుకునే రుహాని టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ పెంచుకుంటోంది. 

రుహని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు. 

రుహాని తదుపరి యంగ్ హీరో కార్తికేయ సరసన నటించబోతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. 

click me!