పొన్నియిన్ సెల్వన్ కాదు అది 'పన్నీరు సెల్వం'... ఆర్ ఆర్ ఆర్ రైటర్ దారుణమైన ట్వీట్!

First Published Oct 1, 2022, 12:57 PM IST

పొన్నియిన్ సెల్వన్ మూవీని కించపరిచేలా రైటర్ కాంచీ వేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఆయన పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని పన్నీరు సెల్వం అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 
 

ponniyin selvan


పొన్నియిన్ సెల్వన్ మూవీ సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఓవర్సీస్ తో పాటు తమిళనాడులో పొన్నియిన్ సెల్వన్ రికార్డు వసూళ్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ మూవీకి చెప్పుకోదగ్గ రెస్పాన్స్ దక్కుతుంది. 
 


విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్ తో పాటు భారీ తారాగణం నటించిన పొన్నియిన్ సెల్వన్ కొన్ని విభాగాల్లో మెప్పించింది. కథ, విజువల్స్, మ్యూజిక్, స్టార్ క్యాస్ట్ పెర్ఫార్మన్స్ అలరించాయి. అయితే నెమ్మదిగా సాగిన కథనం, యాక్షన్ సన్నివేశాలు, నేటివిటీ, పదుల సంఖ్యలో ఉన్న పాత్రలు వంటి విషయాలు నిరాశపరిచాయి. 
 


ఇక బాహుబలి చిత్రానికి పోటీ అన్నట్లు పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ప్రచారం చేశారు. ఈ చిత్రంతో తమిళ సినిమా సత్తా ఏమిటో నిరూపిస్తామని కొందరు నెటిజెన్స్ ప్రగల్భాలు పలికారు. అయితే పొన్నియిన్ సెల్వన్ బాహుబలి చిత్రాలకు ఏమాత్రం పోటీ కాదని తేలిపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. కోలీవుడ్ జనాలు బాహుబలిని ట్రోల్ చేస్తుంటే, తెలుగు ప్రేక్షకులు పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ఏకి పారేస్తున్నారు. 


నెటిజెన్స్ మధ్య ఈ తరహా వార్స్ సాధారణమే. పొన్నియిన్ సెల్వన్-బాహుబలి చిత్రాలకు ముడిపెడుతూ అనేక పోలికలు, వాదనలు తెరపైకి వస్తాయని అందరూ ముందే ఊహించారు. అయితే రాజమౌళి బంధువు, ఆర్ ఆర్ ఆర్ కో-రైటర్ పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ట్రోల్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

SS Kanchi

ఆయన ఇలా ప్రవర్తించడానికి కారణం బహుశా కజిన్ రాజమౌళిపై తమిళులు వేస్తున్న ట్రోల్స్ కావచ్చు. బాహుబలి చిత్రాల్లో కొన్ని సన్నివేశాలు పొన్నియిన్ సెల్వన్ నవల నుండి  రాజమౌళి లేపేశారంటూ కూడా తమిళ తంబీలు ట్విట్టర్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇది ఆయన అసహనానికి కారణమై ఉండవచ్చు.


ఆర్ ఆర్ ఆర్ విడుదల సమయంలో కూడా కోలీవుడ్ జనాలు పనిగట్టుకొని మరీ నెగిటివ్ ప్రచారం చేశారు. ఆర్ ఆర్ ఆర్ విజువల్స్ దారుణంగా ఉన్నాయంటూ ఫోటోలు పోస్ట్ చేసి మూవీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. మూవీలో విషయం ఉంటే నెగిటివ్ ప్రచారం ఏమీ చేయలేదని ఆ మూవీ నిరూపించింది. 

SS Kanchi


కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సహ రచయితగా కాంచీ ఉన్నారు. ఆ మూవీ స్క్రిప్ట్ విషయంలో ఆయన విజయేంద్రప్రసాద్ తో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో అదును చూసి కాంచీ తమిళ జనాలను దెబ్బతీశాడని, మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న పొన్నియిన్ సెల్వం చిత్రాన్ని ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశాడంటున్నారు. మరి కాంచీ ట్వీట్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. 
 

click me!