మా ఆయన కొట్టడం ఖాయమన్న రోజా...కారణం ఏమిటంటే..!

First Published Nov 21, 2020, 8:38 PM IST

నంబర్ వన్ కామెడీ షో జబర్ధస్త్ కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఏడేళ్లుగా జబర్ధస్త్ తెలుగు ప్రేక్షకులను వినోదం పంచుతుంది. ఇక షోలో జడ్జీలుగా రోజా, నాగబాబు చేసే సందడి మరో ఆకర్షణ. కొన్ని కారణాల చేత నాగబాబు జబర్ధస్త్ షోని వీడగా, రోజా మాత్రం కొనసాగుతున్నారు.

ఇక ఎక్స్ట్రా జబర్ధస్త్ తాజా ప్రోమోయూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. నాన్ స్టాప్ కామెడీ పంచ్ లతోఅలరిస్తుంది.సుడిగాలి సుధీర్ తన టీమ్ మేట్స్రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో నవ్వులు పూయించారు. రాకేష్ టీమ్ కూడా మంచి మంచి పంచులతో అల్లాడించారు.
undefined
ఐతే ఆనంద్ సత్తిపండు చేసిన కామెడీ స్కిట్ మరింత ప్రత్యేక సంతరించుకుంది. జబర్ధస్త్ కామెడీ షోలో తరచుగా ఫ్యామిలీ కామెడీ స్కిట్స్ చూస్తూ ఉంటాం.
undefined
భార్యలను భర్తలు తన్నడం, భర్తలను భార్యలు తన్నడం అనేది చాలా స్కిట్స్ లో సహజంగా కనిపించే చర్య. ఈ కామెడీకి జనాలు ఎక్కువగా కనెక్ట్ కావడంతో జబర్ధస్త్ కమెడియన్స్ ఈ ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు.
undefined
ఒకరినొకరు ఎగిరెగిరి తన్నుకునేస్కిట్స్ ఉన్న నేపథ్యంలోఆడవాళ్ళ గెటప్స్ కూడా మగవాళ్ళు వేస్తూ ఉంటారు. ఇక తాజా ప్రోమోవిషయానికి వస్తే జడ్జి రోజా ఆసక్తికరకామెంట్ చేశారు.
undefined
స్కిట్ లో ఆనంద్ ఇంటిలో భార్యతో దెబ్బలు తిని దొర్లుకుంటూబయటికి వస్తాడు. చొక్కా కూడా చిరిగి పోయిన ఆనంద్ ని చూసిసత్తిపండు...ఏందీ భయ్యా నీ భార్యా కొట్టిందా అని అడుగాడు.
undefined
దానికి ఆనంద్ ... జామకాయను చిలక కొట్టడం, పంట చేనును ఎలక కొట్టడం' అనగానే రోజా అందుకొని, మొగ్గుడుని భార్య కొట్టడం కామన్ అని పూరించింది.
undefined
ఆ డైలాగ్ తరువాత, ఈ మాటా మా ఆయన వింటే నన్ను కొడతాడని చెప్పింది. నేను కూడా మా ఆయనను కొడుతున్నట్లు ఒప్పుకున్నట్లే కాబట్టి, ఆయన వింటే కొడతాడనే అర్థంలో రోజా ఆ మాట అన్నారు.
undefined
click me!