హైదరాబాద్, తెలంగాణాలో రెండు వారాల పాటు థియేటర్లు బంద్

By Surya PrakashFirst Published May 15, 2024, 11:35 AM IST
Highlights

 ఆర్థిక ఇబ్బందుల వల్ల రెండు వారాల పాటు ఎవరికి వారే స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు చెప్తున్నారు. 


తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇది  షాకింగ్ న్యూస్. తెలంగాణా రాష్ట్రంలో (హైదరాబాద్ తో కలిపి)  రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నారు.  అయితే మల్టిప్లెక్స్ లు మాత్రం తెరిచి ఉంటాయి.  మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మే 17వ తేదీ అంటే ఈ శుక్రవారం నుంచి హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. 

ఎందుకు ఇలా  సినిమా ధియేటర్లను మూసివేస్తున్నారు అందుకు కారణం ఏమిటి..అని తెలుసుకుంటే .. గత కొద్ది నెలలుగా ఆక్యుపెన్సీ రేటు బాగా పడిపోయిందని , బాగా  తక్కువగా ప్రేక్షకులు వస్తూండటం వల్లే సినిమా ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. అలాగే సినిమా ప్రదర్శనల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ వస్తుందని థియేటర్ యాజమాన్యాల చెప్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల రెండు వారాల పాటు ఎవరికి వారే స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు చెప్తున్నారు. 

Latest Videos

నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచితే సినిమా ప్రదర్శనలు కొనసాగిస్తామంటోన్నాయి యాజమాన్యాలు. మే నెలలో పెద్దగా సినిమాలు రిలీజ్ లేకపోవడంతో థియేటర్లన్నీ ఖాళీగా ఉంటూ కనిపిస్తున్నాయి. దాంతో రోజు వారీ మెయింటెనెన్స్, అలాగే సిబ్బంది జీతాలు చెల్లించడం కష్టంగా మారింది. దాంతో పది రోజుల పాటు సింగిల్ థియేటర్లు మూసి వేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకొన్నది.

సినిమాల విడుదల లేకపోవడం వల్ల థియేటర్ల నిర్వహణ వ్యవహారం కష్టంగా మారింది. దాంతో 10 రోజులపాటు సింగిల్ థియేటర్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకొన్నాం అని ది అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కు లేకపోవటం, జనాలు చిన్న సినిమాలు చూడటానికి థియేటర్స్ రాకపోవటం,ఓటిటిలు , ఎలక్షన్స్  ఇవన్నీ ఈ పరిస్దితికి తీసుకొచ్చాయి.
 

click me!