సబ్జా నీరు తాగితే జుట్టు పెరుగుతుందా..?

First Published | May 15, 2024, 3:46 PM IST

 రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ సబ్జా నీటిని తాగడం అలవాటు చేసుకుంటే... కచ్చితంగా వారి జుట్టు రాలే సమస్య కు పులిస్టాప్ పడుతుంది. 

ఈ మండే ఎండల్లో మనం ఉపశమనం పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాంటి ప్రయత్నాల్లో సబ్జా నీరు కూడా ఒకటి. సబ్జా గింజలను నీటిలో నానపెట్టి..  ఆ నీటిని తాగుతూ ఉంటారు. అలా తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గి.. ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. అయితే.. ఇదే సబ్జా గింజలు మన జుట్టు రాలే సమస్యకు కూడా చెక్ పెడతాయని మీకు  తెలుసా? 

ఈ రోజుల్లో చాలా మంది జుట్టురాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ సబ్జా నీటిని తాగడం అలవాటు చేసుకుంటే... కచ్చితంగా వారి జుట్టు రాలే సమస్య కు పులిస్టాప్ పడుతుంది. అయితే ఈ నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది.
 

Latest Videos


ఒక గ్లాసు వాటర్ లో ముందుగా ఒక స్పూన్ సబ్జా గింజలను వేయాలి. వాటిని కనీసం 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు... ఆ నీటిలో ఒక స్పూన్ తేనె, అరచెక్క నిమ్మరసం పిండుకొని తాగితే సరిపోతుంది.  ఇలా రెగ్యులర్ గా తాగితే... ఒంట్లో వేడి తగ్గడం మాత్రమే కాదు.. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. 


పోషకాలు అధికంగా ఉండే  ఈ సబ్జా గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకే నీటిలో నానబెట్టిన తర్వాత తింటారు. ఈ గింజల్లో ఫైబర్ ,ప్రొటీన్లు అధికంగా ఉంటాయి, అవి సంతృప్తిని ప్రోత్సహిస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మీ జీర్ణ ఆరోగ్యాన్ని మంచి ఆకృతిలో ఉంచుతాయి.

సబ్జా గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు.. 

- సబ్జా గింజలు ఆకలిని అణిచివేస్తాయి. తృప్తి అనుభూతిని ప్రోత్సహిస్తాయి. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇది మంచి ఎంపిక.

 సబ్జా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, ఎందుకంటే ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నెమ్మదిగా జీర్ణం చేస్తుంది.

 సబ్జా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. గుండెల్లో మంట లాంటి సమస్య ఉన్నవారికి.. ఇది మంచి పరిష్కారంగా నిలుస్తుంది. 

click me!