డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల కలలు పడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని కలలు అలాగే గుర్తిండిపోతుంటే.. మరికొన్ని లేచిన వెంటనే మర్చిపోతుంటాం. కలలు మన భవిష్యత్తులో జరిగే శుభ, అశుభ సంఘటనల గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. అయితే చాలా సార్లు మనం మన కలలో ఏడుస్తుంటాం. అసలు మన కలలో ఏడిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కలలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించడం..
మీ కలలో మీరు ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తే ఆ కలను శుభప్రదంగా భావిస్తారు. ఈ కల మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోండటాన్ని సూచిస్తుంది. ఇలాంటి కల పడితే మీ జీవితంలో ఆనందం రాబోతుందని అర్థం వస్తుంది. మీకు ఇలాంటి కల ఎప్పుడైనా పడితే ఎవ్వరికీ చెప్పకండి.
కలలో తల్లిదండ్రులతో ఏడుపు
మీరు కలలో మీ తల్లిదండ్రులతో ఏడుస్తుంటే.. మీ ఇంటికి కొత్త సభ్యుడు వస్తున్నాడని అర్థం. అలాగే ఇలాంటి కల పడితే మీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీనితో పాటుగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ పనిలో ఏదైనా సమస్య ఉంటే కూడా పోతుంది.
sapne me pitro ka dikhna
ఎవరో కలలో ఏడుస్తూ కనిపించడం
మీరు కలలో మరొక వ్యక్తి ఏడుస్తుండటాన్ని చూసినట్టైతే పని గురించి ఎక్కువ ఒత్తిడికి గురయ్యారని అర్థం వస్తుంది. అయితే ఇలాంటి కల పడితే మీరు మీ ఒత్తిడి నుంచి బయటపడతారు. అలాగే మీ జీవితంలోకి ఆనందం కూడా వస్తుండటాన్ని సూచిస్తుంది.
bad dreams
కలలో ఏడుస్తున్న పూర్వీకులను చూస్తే..
కలలో మీ పూర్వీకులు ఏడుస్తున్నట్టు కనిపిస్తే వారి ఆత్మకు శాంతి లభించలేదని అర్థం. కాబట్టి వాళ్లకు పిండం పెట్టి పితృదేవతలకు నీటిని సమర్పించండి. ఇది పూర్వీకులకు శాంతిని కలిగిస్తుంది. అలాగే అలాగే శుభ ఫలితాలను కూడా పొందుతారు.