'మహర్షి' చేస్తున్నప్పటి సంఘటనతో బరువు తగ్గాలనుకున్నా

First Published Sep 14, 2020, 9:16 AM IST


సహాయ నటి విద్యుల్లేఖ రామన్ ఇప్పుడు బరువు తగ్గాలనుకునేవాళ్లకు ప్రేరణగా నిలుస్తోంది.  లాక్‌డౌన్‌ కాలంలో పట్టుదలతో ఎక్సరసైజ్ లు చేసి దాదాపు ఇరవై కేజీల బరువు తగ్గింది. బరువు తగ్గిన ఆమెను, ఆ వెనుక ఉన్న కష్టాన్ని అంకితభావాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే హఠాత్తుగా ఎందుకు బరువు తగ్గాలి అనిపించింది?, త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోంది కాబట్టి కష్టపడి వెయిట్ తగ్గిందని అంటున్నారు. అదేం కాదు ...సినిమాల్లో మరింతగా బిజీ అయ్యేందుకు ఆమె బరువు తగ్గిందని మరికొందరన్నారు.  ఈ నేపధ్యంలో తాను ఎందుకు బరువు తగ్గాలనుకుంది అనేది మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో వివరించింది.

లావుగా ఉండటం వల్ల ఎదుర్కొన్న సమస్యల గురించి విద్యుల్లేఖ తాజాగా షేర్ చేసుకుంది. ‘86.5 కేజీల నుంచి 65.2 కేజీలకు చేరా. అంటే 20+ కేజీలు తగ్గా. ఇది శ్రమ, కన్నీరు, మలుపులతో కూడుకున్న దూర ప్రయాణం.
undefined
నేను షేర్‌ చేసిన ఫొటోలో ఎడమవైపు ఉన్న పిక్చర్‌ చూసినప్పుడు.. అలా ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నా. ఆ ఫొటో తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఓ తమిళ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతోంది. ఆ వేడుకకు వెళ్లడానికి నాకు సరిపోయే దుస్తులు దొరకలేదు. నా వద్ద ఉన్న ఒక్క డ్రెస్‌ కూడా సరిపోలేదు. అందుకే లెగ్గిన్‌ వేసుకుని.. ఆ షేమ్‌ను దాచడానికి‌ పైన కోటులాంటిది వేసుకున్నా’.
undefined
‘ఇక చాలు.. నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా తయారు కావాలి’ అని నా మనసుకు చెప్పుకున్నా. ఆపై నాలో వచ్చిన తేడాను ఈ ఫొటోలో మీరే చూడొచ్చు. ఏదైనా మన కోసం చేయాలి’ అని ఆమె అన్నారు.
undefined
ఇక "మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్నప్పుడు 86 కిలోలు ఉన్నాను. ఆ టైమ్ లో నా పేరెంట్స్ నాకొక డ్రెస్ కొన్నారు. అప్పుడు వేసుకుంటే చాలా బాగుంది. బాగా సూట్ అయింది. కానీ 25 రోజుల తర్వాత మళ్లీ అదే డ్రెస్ వేసుకుంటే నాకు పట్టలేదు. కనీసం మోకాళ్ల నుంచి పైకి కూడా రాలేదు.
undefined
జస్ట్ 25 రోజులకే అంత లావు అయిపోయాను. అప్పుడే నాకు సిగ్గేసింది. ఎలాగైనా తగ్గాలని నిర్ణయించుకున్నాను. నేను వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే." అని అంది.
undefined
అప్పుడు నా మనసులో అనుకున్నాను.. విద్యూ.. ఈ రోజు నుంచి హెల్త్ గురించి, వెయిట్‌ గురించి ఫోకస్ చేయాలని. చాలా డెడికేటెడ్‌గా చేయాలని. సో.. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఫిబ్రవరి 2019లో స్టార్ట్ చేస్తే.. ఈరోజు నేను 20 కిలోస్ తగ్గాను.
undefined
సంవత్సరంన్నర నుంచి వెయిట్‌ లాస్‌ జర్నీ చేస్తున్నాను. సడెన్‌గా చేసింది అయితే కాదు. క్విక్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయలేదు. షాట్‌ కట్స్ చేయలేదు. చాలా నెమ్మదిగా వన్‌ అండ్‌ హాప్‌ సంవత్సరం నుంచి వెయిట్‌ లాస్‌ స్టార్‌ చేశాను.
undefined
బొద్దుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాను కానీ.. హెల్త్ పరంగా ఇబ్బందులు ఫేస్‌ చేశాను. అలాగే షూటింగ్‌లో కూడా కంఫర్ట్‌గా లేను. అది నా మేనేజర్‌కి కూడా తెలుసు. చాలా బద్దకంగా ఉండేదానిని.
undefined
అస్తమాను పడుకోవమే చేసేదానిని. ఫేస్‌ కూడా ఇబ్బందిగా తయారై.. స్క్రీన్‌పై కూడా బాగుండేది కాదు. నా వర్క్‌ అవుట్‌ పుట్‌ మీద కూడా నేను హ్యపీగా ఉండేదానిని కాను. ఇలా మారిన తర్వాత బాగుంటుందని అనుకున్నాను.. ఇప్పుడదే జరుగుతుంది.
undefined
డైట్‌ కంట్రోల్‌ విషయానికి వస్తే ఫుడ్ మానేయడం కష్టమే కానీ.. కొన్నిసార్లు త్యాగాలు తప్పవు కదా. రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా ఫోకస్‌ చేయాలి. గోల్‌ రీచ్‌ అయ్యే వరకు తప్పదు మరి. వెయిట్‌ లాస్‌ జర్నీలో కొంచెం సెల్ప్‌ కంట్రోల్ చేయాలి. కాంప్రమైజెస్ చేయాలి. ఈ సంవత్సరంన్నరలో నేను నేర్చుకుంది ఇదే.
undefined
"నా కాబోయే భర్త సంజయ్, నేను గతేడాది నుంచే ప్రేమించుకుంటున్నాం. 2020లో ఎంగేజ్ మెంట్ చేసుకుందామని, 2021లో పెళ్లి చేసుకుందామని గతేడాదే అనుకున్నాం. అంతలోనే కరోనా వచ్చింది. అన్నీ మారిపోయాయి. కానీ కాస్త లో-ప్రొఫైల్ లోనైనా ఎంగేజ్ మెంట్ చేసుకుంటే మా అమ్మా-నాన్న హ్యాపీగా ఉంటారని భావించి నిశ్చితార్థం చేసుకున్నాం. పెళ్లికి అందర్నీ పిలవలేకపోచ్చు.. అందుకే లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం"
undefined
మాది లవ్‌ మ్యారేజ్ ..ఫస్ట్ సంజయే ప్రపోజ్ చేశారు. విషయం ఏమిటంటే.. నేను ఏం చేస్తాననేది ఆయనకి తెలియదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను ఏ పాత్రలు చేస్తానో కూడా తెలియదు. నార్త్ ఇండియన్‌ అబ్బాయ్ కదా.. నా సినిమాలు ఆయన చూడలేదు. మేం ఫస్ట్ మీట్‌ అయినప్పుడు నా గురించి ఆయనకేమీ తెలియదు. నాకు అదే నచ్చింది. చాలా మంది మీరు నటి, ఫేమస్‌ అంటూ ఏవేవో చెబుతారు. కానీ సంజయ్‌ ఆ టైప్ చేయలేదు.
undefined
నా కాబోయే భర్త ఫిట్‌నెస్‌ ట్రైనర్ కాదు. ఆయనకి ఐస్‌క్రీమ్‌ తయారుచేసే యూనిట్‌ ఉంది. సుగర్‌ ఫ్రీ, లో కేలరీ ఐస్‌క్రీమ్ చేస్తుంటారు. అతని టెక్స్‌టైల్‌ బిజినెస్ ఫ్యామిలీ.
undefined
వెయిట్‌ లాస్‌ విషయంలో ఆయన హెల్ప్ ఖచ్చితంగా ఉంది. సంజయ్‌ని కలవక ముందే నా వెయిట్‌ లాస్‌ జర్నీ స్టార్ట్ అయింది. ఆయన కూడా కొన్ని టిప్స్ చెప్పడంతో, అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి అని చాలా విషయాలు బయటపెట్టింది ఈ లేడీ కమెడియన్.
undefined
పెళ్లి కబుర్లు చెప్తూ..."రోకా పూర్త‌యింది. అతికొద్ది మంది మ‌ధ్య‌ మాత్ర‌మే ఈ వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌లో మేం మాస్కులు ధ‌రించాం, కేవ‌లం ఫొటోలకు స్టిల్స్ ఇచ్చే స‌మ‌యంలో మాత్రం వాటిని తీసివేశాం. మాకు శుభాకాంక్ష‌లు చెప్పిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు" అని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు.
undefined
తమిళ క్యారెక్టర్‌ నటుడు, సినిమా జర్నలిస్ట్‌ మోహన్‌ రామన్‌ కుమార్తె విద్యుల్లేఖ. ఇన్నాళ్లూ కుమారి విద్యుల్లేఖగా ఉన్న ఆమె త్వరలో శ్రీమతి కానున్నారు. పుట్టి పెరిగింది చెన్నైలో అయినా తెలుగువారి అభిమాన హాస్యనటిగా మారింది విద్యుల్లేఖ రామన్‌. బెస్ట్ కమెడియన్‌గా ఫీమేల్‌ కేటగిరీలో ఆమె నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇటీవల పేరుకు తగినట్లుగా లతలా మారి.. త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కబోతోంది.
undefined
click me!