ఈరోజు ఎపిసోడ్ లో కన్నబాబు రామచంద్ర దగ్గరికి వెళ్లి నిన్నే పలకరిద్దామని బయలుదేరాను రామచంద్ర. బాగాలేవు అంట కదా, ఊర్లో జనాలు అందరూ కూడా నీ గురించే గుసగుసలు బిడ్డ అమ్మకు తెలియకుండా చేశాడని అనుకుంటూ ఉన్నారు అని అంటాడు. భార్య మాటలు విని తమ్ముడు పేరు అడ్డం పెట్టుకొని డబ్బులు కొట్టేసాడు అని అందరూ అనుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు రామచంద్ర చూడు కన్నబాబు ఇది మా కుటుంబ వ్యవహారం అనవసరంగా జోక్యం చేసుకోకు అని అంటాడు. అప్పుడు విషయం తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ కన్నబాబు రామచంద్ర ని మరింత రెచ్చగొడుతూ ఉంటాడు.