అమ్మమ్మ చేతి వంట.. ఈజీగా చేసుకునే రసం పొడి.. టేస్ట్ అదిరిపోతుంది..!

First Published | May 1, 2024, 10:44 AM IST

 ఈ రసం పొడిని చాలా తక్కువ పదార్థాలతో.. అమ్మమ్మ చేతి వంట రుచి వచ్చేలా కమ్మగా చేయాలంటే... ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
 

ఈ ఎండాకాలం మనం ఎక్కువగా ఫ్రైలు, బిర్యానీలు, మసాలా వంటి కూరలు తినలేం. అసలే వేడిగా ఉంటుంది. కాబట్టి.. ఎక్కువగా రసం, పప్పు చారు వంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే.. రసం చేయడానికి సింపుల్ గానే ఉంటుంది. కానీ... బయట మార్కెట్లో దొరికే రసం పొడి వాడటం వల్ల అంత మంచి సువాసన, రుచి రెండూ కరువౌతాయి. అలా అని ఇంట్లోనే రసం పొడి తయారు చేయడం అందరికీ  రాకపోవచ్చు. వచ్చినా అది చాలా పెద్ద ప్రాసెస్ అని.. మార్కెట్లో దొరికే పొడి కొంటూ ఉంటారు. కానీ.. రసం పొడిని మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా కేవలం మూడు సింపుల్ స్టెప్స్ లో తయారు చేయవచ్చు అని మీకు తెలుసా?
 

రసం చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు తినవచ్చు. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి కూడా సహాయపడుతుంది. ఈ రసం పొడిని చాలా తక్కువ పదార్థాలతో.. అమ్మమ్మ చేతి వంట రుచి వచ్చేలా కమ్మగా చేయాలంటే... ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Latest Videos


ఈ రసం పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు..

పావు కప్పు దనియాలు, 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, నాలుగు ఎండు మిర్చీ, 1 టేబుల్ స్పూన్ కంది పప్పు, 15నుంచి 20 కరివేపాకు ఆకులు
 

తయారీ విధానం..
ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం మంటపై ఉంచి దనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిర్చీ, కంది పప్పు వేసి.. బబాగా వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. రెండు, మూడు నిమిషాలు అలానే వేయించి తర్వాత.. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి వేగిన సమయంలో కమ్మని వాసన మనకు వస్తుంది. అలా వచ్చినప్పుడు వేగిపోయినట్ల మనకు అర్థమౌతుంది. ఇప్పుడు వేయించిన వాటన్నంటినీ చల్లపడే వరకు ఆగాలి.

వేయించిన మసాలా దినసులు ఆరపోయిన తర్వాత... వాటిని బ్లెండర్ లో వేసి.. మంచిగా పొడి చేసుకోవాలి.  అలా బ్లెండ్ చేయడానికి ముందు... కరివేపాకు ఆకులను కూడా వేయాలి.  అయితే.. పొడి లాగానే చేసుకోవాలి. ముద్ద లాగా, పేస్టు లాగా కాకుండా జాగ్రత్తపడాలి.

ఇప్పుడు ఈ పౌడర్ ని... గాలి చొరపడని కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని మనం ఫ్రిడ్జ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. తడి తగలకుండా ఉంటే.. 3 నెలల పాటు.. దీనిని వాడుకోవచ్చు. మూడు నెలల పాటు కమ్మని రుచి, మంచి వాసనను అందిస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ తో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం చేసుకోవచ్చు.  మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.
 

click me!