సూపర్‌ స్టార్‌ సినిమాలో వేణు స్వామి.. రెండు చిత్రాల్లో మెరిసిన సెలబ్రిటీ జ్యోతిష్యుడు.. రిజల్ట్ ఏంటో తెలుసా?

First Published May 1, 2024, 10:46 AM IST

ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామిలో మరో టాలెంట్‌ ఉంది. ఆయన నటుడిగానూ మెరిశాడు. కానీ వాటి రిజల్ట్ లు మాత్రం ఆశ్చర్యపరచడం గమనార్హం. 
 

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. సినిమా సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ పాపులర్‌ అయిపోయాడు. సోషల్‌ మీడియాని వాడుకుని సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా రాణిస్తున్నారు. యూట్యూబ్‌ ఇంటర్వ్యూలలో స్టార్‌ హీరోలపై కామెంట్లు చేస్తూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.  
 

ప్రభాస్‌ జ్యోతిష్యం చెప్పి ఒక్కసారిగా పాపులర్‌ అయ్యాడు వేణు స్వామి. ఆయన వరుసగా పరాజయాలు వస్తాయని, పెళ్లి యోగం లేదని సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అంతేకాదు తమ తోటలో పండే పళ్లని ప్రభాస్‌కి పంపిస్తామని చెప్పడం విశేషం. దీంతోపాటు మెగా ఫ్యామిలీపై, ఎన్టీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. 

దీనితోడు పూజలు కూడా చేస్తారు వేణు స్వామి. హీరోయిన్ల కెరీర్‌ బాగుండాలని వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. చాలా మంది హీరోయిన్లు ఆయన వద్ద పూజలు చేసుకోవడం విశేషం. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. పెద్ద పెద్ద హీరోలు, సినిమా ప్రముఖులు తన వద్ద జాతకంచెప్పించుకుంటారని తెలిపారు వేణుస్వామి. రాజకీయ నాయకులు కూడా ఉన్నారని చెప్పడం విశేషం. 
 

అయితే సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబితేనే తాను ఫేమస్‌ అవుతానని, అందుకే వారి జాతకాలను స్వయంగా చెబుతానని తెలిపారు. ఇలా తాను కెరీర్‌ ప్రారంభం నుంచి ఇలానే సినిమా వాళ్లనే టార్గెట్ చేశాడు వేణుస్వామి. ఇన్నాళ్లకి సోషల్‌ మీడియా పుణ్యమా అని ఆయనకు లైఫ్‌ వచ్చింది. ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు.
 

వేణు స్వామిలో జ్యోతిష్యుడు మాత్రమే కాదు, నటుడు కూడా ఉన్నాడు. ఆ సరదా కూడా ఆయన తీర్చుకున్నాడు. ఇప్పటికే ఆయన రెండు సినిమాల్లో మెరిశారు. అయితే సినిమాల్లోనూ ఆయన అదే పాత్రలు పోషించడం విశేషం.గుళ్లో పూజారిగా కనిపించాడు వేణు స్వామి. తాజాగా ఆ వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

జగపతిబాబు హీరోగా నటించిన `జగపతి` చిత్రంలో ఆయన పూజారిగా మెరిశాడు. గుళ్లో తిరునాళ్లకి బాగా డబ్బులు పోగు అయ్యాయటగా అని జగపతిబాబు అడగ్గా, అవునండి అని పూజారిగా ఉన్న వేణు స్వామి రియాక్ట్ కావడం విశేషం. అన్నీ పోలీస్‌ స్టేషన్‌కి పంపించు అని జగపతిబాబు అనగా, అలాగే అండీ అంటాడు వేణుస్వామి. పక్కనే హీరోయిన్‌ ఉంటుంది. చూశావా అమ్మ దారుణం. ఎవరైనా తప్పు చేసి గుడికి వస్తారు. కానీ ఇతను గుళ్లోనే తప్పు చేస్తున్నాడని వేణు స్వామి చెప్పడం విశేషం. 
 

దీంతోపాటు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాలోనూ కనిపించాడు వేణు స్వామి. `అతడు` సినిమాలో ఓ పెళ్లి సాంగ్‌లో పూజారిగా కనిపించాడు. నూతన వధువరులకు పెళ్లి చేసే పూజారిగా కనిపిస్తూ, వారిపై అక్షింతలు చల్లుతూ కనిపిస్తాడు. ఈ వీడియో క్లిప్‌ సైతం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో కనిపించింది ఈయనేనా అంటూ నెటిజన్లు మీమ్స్ తో రచ్చ చేస్తున్నారు. ఈయనలో ఆ టాలెంట్ కూడా ఉందా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. 
 

Venu Swami

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయాయి. `జగపతి` సినిమా ఫెయిల్‌ అయితే, `అతడు` సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. కానీ టీవీలో మాత్రం దుమ్మురేపింది. అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. అదే సమయంలో అత్యధికసార్లు టెలికాస్ట్ అయిన మూవీగానూ రికార్డు క్రియేట్‌ చేసింది. 
 

click me!