మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో రకుల్ రచ్చ.. మత్తు చూపులతో మైకం తెప్పిస్తున్న స్టార్ హీరోయిన్!

First Published Oct 18, 2022, 4:41 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) క్రేజీ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ లో దుమ్ములేపుతోంది. స్టార్ హీరోయిన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె గ్లామర్ లుక్ కు మంత్రముగ్ధులవుతున్నారు.
 

స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది రకుల్ ప్రీత్ సింగ్. కొన్నాళ్లుగా టాలీవుడ్ లోనే ఊపూపిన యంగ్ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ వైపు మళ్లీంది. నాలుగేండ్లుగా హిందీలోనే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలల్లో నటిస్తోంది. 
 

చివరిగా తెలుగులో పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘కొండపొలం’లో నటించింది.  ఈ చిత్రం పెద్ద ఆకట్టుకోలేదు. దీని తర్వాత రకుల్ నటించిన మరో తెలుగు సినిమా లేదు. దీంతో అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. మళ్లీ రకుల్ తెలుగులో ఎప్పుడు కనిపిస్తుందని ఎదురుచూస్తున్నారు. 
 

ఈ క్రమంలో తన అభిమానులను ఖుషీ చేసేందుకు రకుల్ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. సినిమా అప్డేట్స్ తో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈక్రమంలో  క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ విందుతోనూ మతిపోగొడుతోంది. 
 

తాజాగా రకుల్ అదిరిపోయే అవుట్  ఫిట్ లో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. బ్లర్ మోడ్ లో గ్లామర్ పిక్స్ ను షేర్ చేసుకుంది. రోజురోజుకు మరింత స్లిమ్ గా తయారవుతున్న ఈ బ్యూటీ.. హాట్ నెస్ లోనూ అదరహో అనిపిస్తుంది.  
 

ఇంటర్నెట్ ఫ్యాన్స్ లోనూ రకుల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పోస్ట్ చేస్తున్న గ్లామర్ పిక్స్ ను లైక్ చేస్తూ, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. రకుల్ అందాలను వర్ణిస్తూ ఆమెను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఫ్యాన్స్ ఎంకరేజ్ మెంట్ తో రకుల్ కూడా గ్లామర్ విందులో మరింతగా రెచ్చిపోతోంది. మరోవైపు ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది. 
 

ఇటీవల రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నానీ (Jaccky Bhagnani) పెళ్లి చేసుకోబోతుందంటూ రకుల్ సోదరుడు ట్వీటర్ ద్వారా తెలపడంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ షేక్ అయ్యింది. తర్వలోనే రకుల్ పెళ్లి చేసుకుంటే సినిమాలకు దూరంగా ఉంటుందా? ఏంటని అభిమానులు ఆందోళన చెందారు. 

పెళ్లి వార్తలపైనా రకుల్ స్పందించింది. తన తమ్ముడు సరదాగా చెప్పిన మాటేనని ఇండైరెక్ట్ గా బదులిచ్చింది. మొత్తానికి ఇప్పట్లో రకుల్ పెళ్లి అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘మేరీ పత్నీ’,‘ఇండియన్ 2’ చిత్రాల్లో నటిస్తోంది. ‘ఇండియన్ 2’తో సౌత్ మరోసారి తారా స్థాయిలో అలరించబోతోంది.

click me!