ట్రెడిషనల్ అందాలతో కట్టిపడేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. కవ్వించే పోజులతో కలవరపెడుతున్న ఢిల్లీ భామ!

First Published Dec 15, 2022, 12:53 PM IST

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ ఊగిపోతోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో యంగ్ బ్యూటీ మతులుపోయేలా ఫొటోషూట్ చేసింది.
 

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదనే చెప్పాలి. స్టార్ హీరోల సరసన హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తోంది.
 

హిందీలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రచ్చ చేస్తోంది. తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తోంది. క్రేజీ అప్డేట్స్ అందిస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. 
 

స్టార్ హీరోయిన్ అయినప్పటికీ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇంటర్నెట్ లో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు గ్లామర్ విందు చేస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.

తాజాగా రకుల్ ట్రెడిషనల్ లుక్ మెరిసిపోతోంది. పంజాబీ వెడ్డింగ్ లో పాల్గొన్న ఈ బ్యూటీ.. ఎల్లో చుడీదార్ లో దర్శనమిచ్చింది. మైమరిపించే అందంతో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. అలాగే అదిరిపోయే ఫొటోషూట్ కూడా చేసింది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
 

ఎల్లో చుడీదార్ లో మెరిసిన రకుల్ ప్రీత్.. కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. సూర్యరష్మిని ఆస్వాదిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. మత్తు పోజులు, కవ్వించే చూపులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది స్టార్ హీరోయిన్ రకుల్. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలను లైక్స్, కామెంట్లతో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. 
 

కేరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది బాలీవుడ్ లో ఐదు చిత్రాలను విడుదల చేసింది రకుల్. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ సౌత్ వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు ఎస్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ (Indian 2) లో నటిస్తోంది. మున్ముందు మరిన్ని ప్రాజెక్టులను ఓకే చేసే అవకాశం ఉంది.
 

click me!