Guppedantha Manasu: రిషిని చంపేస్తానని వసుని బెదిరించిన రాజీవ్.. వసుధార కోసం వచ్చిన రిషి?

First Published Jan 3, 2023, 10:18 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో చక్రపాణి, రాజీవ్ తో మాట్లాడుతూ అల్లుడుగారు ఇందాకే ఆ రిషి అనే వాడు ఫోన్ చేశాడు. ఇక్కడికి వస్తున్నానని చెప్పాడు ముహూర్తం టయానికి ముందుగానే వచ్చేలా ఉన్నాడు. అమ్మాయికు ధైర్యం చెబుతూ నీకు ఆ రాజీవ్ కు పెళ్లి ఏంటి అని అడుగుతున్నాడు. నాకు కొంచెం టెన్షన్ గా ఉంది ఎలా అయినా అమ్మాయికి మీరు నచ్చే చెప్పండి అని అనడంతో మామయ్య గారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఈ రాజీవ్ ఉన్నాడు కదా మీరు ధైర్యంగా ఉండండి అనడంతో సుమిత్ర, వసుధార ఇద్దరు అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు రాజీవ్ మీ అమ్మాయే ఆ వచ్చే రిషిని వెలగొట్టేలా నేను చేస్తాను కదా మీరు ధైర్యంగా ఉండండి అనడంతో సుమిత్ర వసుధార షాక్ అవుతారు.

మీ అమ్మాయికి రిషి మంచివాడు నేను మంచివాడో అర్థమవుతుంది అర్థమయ్యేలా నేను చెబుతాను అని అంటాడు. తర్వాత రాజీవ్ మీరు ఏర్పాట్లు చూసుకోండి నేను వసుధారకు నచ్చజెప్పి వస్తాను అత్తయ్య గారు మీరు కూడా ఏర్పాట్లు చూడండి అనడంతో సుమిత్ర కోపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రాజీవ్ లోపలికి వెళుతుండగా అల్లుడుగారు అని పిలిచి పెళ్లి బట్టలు మీ చేతులుగా ఇవ్వండి అని అంటాడు చక్రపాణి. అప్పుడు దొంగ ప్రేమలు చూపిస్తూ రాజీవ్ నాటకాలు ఆడుతూ ఉంటాడు. అది చూసి వసుధార సుమిత్ర ఇద్దరూ చీదరించుకుంటూ ఉంటారు. తర్వాత రాజీవ్ వసుధార గదిలోకి వెళ్లి తలుపుకు గడియ వేయడంతో బావ మర్యాదగా బయటికి వెళ్ళు అని అంటుంది వసుధార.
 

 అప్పుడు రాజీవ్ రా వసుధార అని చేయి పట్టుకోవడంతో విదిలించుకుని కోపడుతూ మర్యాదగా బయటకు వెళ్ళు అని అంటుంది. అప్పుడు రాజీవ్ ఇంకా బావ ఏంటి వసుధార మరికొద్ది సేపట్లో మనిద్దరం భార్యాభర్తలు కాబోతున్నాము ప్రేమగా నన్ను ఏవండీ అని పిలువు అని మాట్లాడుతుండడంతో వసుధార అసహ్యించుకుంటూ ఉంటుంది. మనిద్దరికీ శుభవార్త ఏంటంటే మీ అక్క కొడుకు ఉన్నాడు కదా అదే నా కొడుకు వాడిని మనిద్దరం ప్రేమగా చూసుకొని మంచి చదువులు చదివిద్దాం. నీ పెంపకంలో వాడు ఇంకా మంచివాడు అవుతాడు అంటూ అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాడు రాజీవ్.
 

అప్పుడు వసుధార బావ మర్యాదగా బయటకు వెళ్ళు అనడంతో వెంటనే రాజు తన మొబైల్ ఫోన్ తీసి నువ్వు మీ రిషి సార్ చట్టా పట్టాలేసుకొని తిరిగినవన్నీ ఇందులో రికార్డ్ చేసి పెట్టాను అంతేకాదు ప్రెస్ వాళ్లకు మీడియా వాళ్లకు కొన్ని కాపీలు కూడా పంపించాను నువ్వు కాదు నేను పెళ్లి చేసుకోను అంటే మీడియా వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తారు ఆ ఫోటోలని టెలికాస్ట్ చేస్తారు అనడంతో వసుధార షాక్ అవుతుంది. మీడియా వాళ్ళు ఇంటికి వస్తే మీ నాన్న పరువు పోతుంది అప్పుడు మీ నాన్న ఉరేసుకుని చచ్చిపోతాడు. అప్పుడు మీ అమ్మ కూడా పోతుంది అని అనడంతో వసుధార కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
 

 నీకున్న ఒక అక్క చచ్చిపోయింది ఇంకొక అక్క కష్టాలు పడుతోంది నీ తమ్ముడు హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నాడు ఇక నీ బాగోగులు ఎవరు చూసుకుంటారు నేనే కదా అని అంటాడు రాజీవ్. అప్పుడు వసుధార నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ బావ నువ్వు ఎంత భయపెట్టినా నేను భయపడను అని అంటుంది. అప్పుడు రాజీవ్ నవ్వుకుంటూ నీకు భయం లేదని ధైర్యం ఎక్కువ ఉందని నాకు కూడా తెలుసు అంటూ తన జేబులో నుంచి గన్ను తీయడంతో అది చూసి వసుధర షాక్ అవుతుంది. దీనినీ కూడా వాడాలని డిసైడ్ చేసుకున్నాను. మనం భార్యాభర్తలమే కదా మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం.

ఈ గన్ను చివరిసారిగా ఎప్పుడూ వాడానో తెలుసా ఒకరోజు మీ జగతి మేడంని షూట్ చేశారు కదా అది ఎవరో కాదు నేనే అని అనడంతో వసుధర షాక్ అవుతుంది. ఆరోజు గురి తప్పింది ఈసారి చాలా ప్రాక్టీస్ చేశాను ఈసారి మాత్రం గురి తప్పదు అని అంటాడు రాజీవ్. అప్పుడు ఏంటి బెదిరిస్తున్నావా అని అంటుంది వసుధార. అప్పుడు గన్ను తన వైపుకు తిప్పుకొని కాల్చు అని అనడంతో నువ్వు నా ప్రాణం వసు నేను నిన్ను ఎలా కాలుస్తాను అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు రాజీవ్. నీ ప్రాణాలన్ని నీ దగ్గర లేవని నాకు తెలుసు నీ ప్రాణాలని మీ రిషి సార్లో ఉన్నాయి. అందుకే మొదట మీ రిషి సార్ ని చంపేస్తాను.
 

ఆ తర్వాత రెండవ బుల్లెట్ మీ జగతి మేడంకి మూడో బుల్లెట్ మీ మహేంద్ర సార్ కి అనడంతో వసుధార షాక్ అవుతుంది. నువ్వు అంతవరకు కూడా తీసుకురావని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఎలాగో నీ రిషి సార్ వస్తాడు నచ్చచెప్పుకుంటావో కోప్పడతావో నీ ఇష్టం ఇకనుంచి వెళ్ళిపోయేలా చెయ్యి అని వసుధారని బెదిరిస్తాడు. ఇక్కడ మీ రిషి సార్ కనుక రచ్చ రచ్చ చేస్తే మీ కళ్ళముందే మీ రిషి సార్ ని చంపేస్తాను అని బెదిరిస్తాడు. దాంతో వసుధర షాక్ అవుతుంది. ఆ తర్వాత మీ అమ్మ మీ నాన్నలను కూడా చంపేస్తాను అని అంటాడు. తర్వాత వసుధారకు బలవంతంగా చేతిలో బట్టలు పెట్టి బయటకు వెళ్లిపోవడంతో వసుధార కోపంతో ఆ బట్టలను విసిరేస్తుంది.
 

ఆ తర్వాత వసుధార పెళ్లికూతురుగా రెడీ అయ్యి అద్దం ముందు కూర్చుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడురాజీవ్ అన్నమాట తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. తరువాత రిషి ఇచ్చిన ఉంగరాన్ని చూసి రిషి గడిపిన క్షణాలు తలుచుకుని ఈ వసుధార మీ సొంతమే రిషి సార్ అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జగతి ఇచ్చిన మంగళసూత్రాన్ని చూస్తూ ముందు జాగ్రత్తతో నాకు నీ గిఫ్ట్ గా ఇచ్చారా మేడం అని అనుకుంటే ఉంటుంది. అప్పుడు ఆ మంగళసూత్రాన్ని పట్టుకొని నిలబడడంతో ఎదురుగా రిషి వస్తాడు. అప్పుడు రిషిని చూసి వసుధార సంతోష పడుతూ ఉంటుంది.

click me!