‘RRR’పై కాపీ గోల.. ఆ సినిమా మూలమంటూ ప్రచారం!

First Published Apr 2, 2020, 12:05 PM IST

పెద్ద సినిమాలు ఎనౌన్స్ చేసిన నాటి నుంచి దాని కథేమిటి, హీరో క్యారక్టర్ ఏమిటి అంటూ చర్చలు మొదలైపోతాయి. ఈలోగా ఏ ఫస్ట్ లుక్ పోస్టర్ లేక వీడియోని రిలీజ్ చేస్తే ఇంక ఇదే కథ అంటూ కొందరు పులిహార వండేయటం మొదలెట్టేస్తారు. మరికొందరైతే...దీనికి ఫలానా సినిమా మూలమంటా అని రచ్చ చేయటం మొదలెడతారు. ఇప్పుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ కూడా ఓ సినిమా కాపీ అంటూ ప్రచారం మొదలైంది. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. 
 

‘బాహుబలి’ తో తెలుగు సినిమా సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. ఈ జక్కన్న చెక్కుతున్న కొత్త శిల్పం ‘RRR’. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. అలాగే హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్,సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు
undefined
ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ అంటే ‘రౌద్రం రుధిరం రణం’ అని.. సినిమాలో రామ్ చరణ్, జూనియర్ పాత్రలు ఎలా ఉన్నాయో రెండు వీడియోల్లో రాజమౌళి చూపించేశాడు. ఇదే కాపీ రూమర్స్ కు ఆధారమైంది.
undefined
ఈ వీడియోల్లో ఇద్దరి హీరోల క్యారక్టర్స్ ని బట్టి ఇదిగో ఈ సినిమా ఫలానా సినిమాకు కాపీలా ఉందని నెటిజన్లు తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. అంతేకాదు.. ఆ సినిమా టైటిల్, పోస్టర్ పెట్టి మరీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
ఆ సినిమా 1983లో విడుద‌లైన ఫాంట‌సీ అడ్వెంచ‌ర‌స్ హాలీవుడ్ మూవీ ‘ఫైర్ అండ్ ఐస్’ . రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కాన్సెప్ట్‌కి ఇది ద‌గ్గర‌గా ఉంద‌ని చెప్పేస్తున్నారు.
undefined
ఈ హాలీవుడ్ చిత్రంలో నుంచే ఒక పాయింట్‌ ఎత్తేసి కథ అల్లేశాడని ఆడిపోసుకుంటున్నారు.. హాలీవుడ్ సినిమాను చక్కగా ఇండియన్ నేటివిటి అది కాపీ కొట్టేసాడని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తున్నారు.
undefined
ఈ హాలీవుడ్ చిత్రంలో నుంచే ఒక పాయింట్‌ ఎత్తేసి కథ అల్లేశాడని ఆడిపోసుకుంటున్నారు.. హాలీవుడ్ సినిమాను చక్కగా ఇండియన్ నేటివిటి అది కాపీ కొట్టేసాడని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తున్నారు.
undefined
అయితే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఫలానా కాపీ అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. అలా విమర్శించే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తున్నారు.
undefined
అక్కడితో ఆగకుండా రాజమౌళి గత చిత్రాల్లో సీన్స్,కాన్సెప్టులు ఎక్కడనుంచి కాపీ కొట్టాడు అంటూ లిస్ట్ పెడుతున్నారు. బాహుబలి లో చాలా సీన్స్ వేరే భాష నుంచి లేపారని, మగధీర సినిమాలో హైలెట్ గా నిలిచిన సీన్ ..300 నుంచి లేపారని ఇలా వరసపెట్టి దండకం చదివేస్తున్నారు.
undefined
అయితే ఇప్పటి వరకూ రాజమౌళి సినిమాలపై ఎన్ని కాపీ కామెంట్స్ పడినప్పటికీ వాటి పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాదు.... అలా విమర్శలు వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి,విమర్శించనవాళ్లకు షాక్ ఇచ్చినవే.. అదే బాటలో ఈ ‘RRR’ కూడా ఉండే అవకాసం ఉంది కదా.
undefined
పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
undefined
click me!