ఆషురెడ్డితో రాహుల్ రొమాంటిక్ ఫోజ్... ఎట్టకేలకు రిలేషన్ బయటపెట్టాడు!

First Published Jan 17, 2021, 4:05 PM IST

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియా పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ తన తోటి కంటెస్టెంట్ ఆషురెడ్డిని అమాంతగా పైకి ఎత్తుకున్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా తమ రిలేషన్ ఏమిటనే దానిపై క్లారిటీ ఇచ్చాడు. 
 

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రాహుల్ నటి పునర్నవి భూపాళంతో స్ట్రాంగ్ లవ్ స్టోరీ నడిపారు. పునర్నవి- రాహుల్ లవ్ స్టోరీ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ కాగా అతడు టైటిల్ గెలుచుకోవడంలో బాగా ఉపయోగపడింది.
undefined
హౌస్ నుండి బయటికి వచ్చాక కూడా పునర్నవి, రాహుల్ రిలేషన్ కొన్నాళ్లు కొనసాగింది. ఆ తరువాత ఎవరి ప్రొఫెషనల్ వాళ్లు బిజీ అయ్యారు. ప్రేమ వార్తలు మెల్లగా పటాపంచలు అయ్యాయి.
undefined
ఐతే రాహుల్ ప్రేమ కహానీలలో ఆశురెడ్డి కూడా ఉంది. రాహుల్ అనేక మార్లు పబ్లిక్ ప్రదేశాల్లో అషురెడ్డితో కనిపించారు. ప్రైవేట్ పార్టీల్లో తరచుగా వీరు కలిసి కనిపించడం అనేక పుకార్లకు కారణం అయ్యింది.
undefined
అలాగే ఆషురెడ్డి తో రాహుల్ చేసే సోషల్ మీడియా పోస్టులు కూడా వీరి మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానాలు కలిగించేవి.
undefined
తాజాగా రాహుల్.. ఆషురెడ్డితో ఓ రొమాంటిక్ పోజ్ లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆషురెడ్డిని అమాంతంగా పైకి ఎక్కించుకున్న రాహుల్.. ఫ్రెండ్స్ అంటే ఇలానే ఉంటది అంటూ వాళ్ళ రిలేషన్ రివీల్ చేశాడు.
undefined
నీ నిజమైన ఫ్రెండ్ కి నీ వీక్ నెస్ తెలుస్తుంది.. కానీ నీ స్ట్రెంగ్త్ చూపించూ అంటూ కామెంట్ పెట్టిన రాహుల్.. మజాక్ కాదు, ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది అని కామెంట్ చేశాడు
undefined
రాహుల్ సడన్ గా ఇలాంటి ఫోటో పంచుకుని నెటిజెన్స్ ని ఆకర్షించిడం వెనుక కారణం... తన వ్యాపార ప్రచారం కోసమే.  రాహుల్ ఈ మధ్య కొత్తగా గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు.
undefined
'ఊకో కాకా' బ్రాండ్ నేమ్ తో  కరీంనగర్ లో ఓ స్టోర్ లాంఛ్ చేయగా... సక్సెస్ అయ్యింది. దీనితో హైదరాబాద్ లో కూడా ఓ స్టోర్ ప్రారంభిస్తున్నాడు రాహుల్. ఆ స్టోర్ లాంఛింగ్ ప్రోగ్రామ్ లో ఆషురెడ్డి కూడా పాల్గొననుంది.
undefined
ఏదో ఒక సెన్సేషన్ లేనిదే నెటిజెన్స్ ని ఆకర్షించలేం కదా. అందుకే రాహుల్ తెలివిగా ఆషురెడ్డితో ఓ రొమాంటిక్ ఫోటో దిగి.. దాని క్రింద డిస్క్రిప్షన్ మాత్రం తన వ్యాపారం గురించి తెలియజేశాడు.
undefined
click me!