Latest Videos

ఓటీటి రైట్స్ ఎంతకు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాక్

By Surya PrakashFirst Published May 22, 2024, 2:52 PM IST
Highlights

 అజిత్ తాజా చిత్రానికి సైతం ఓటిటి బిజినెస్ పూర్తైంది. అయితే మైండ్ బ్లాక్ అయ్యే రేటుకు ఈ సినిమా రైట్స్ వెళ్లాయని వినికిడి. 


 ఈ రోజు పెద్ద,చిన్న సినిమా అనే తేడా లేకుండా ఎవరికైనా ఓటిటి బిజినెస్ అనేది కీలకం అయ్యిపోయింది. సినిమా ప్రారంభం నుంచే ఓటిటి లెక్కలు వేసుకుని మరీ బడ్జెట్ పెడుతున్నారు. అలాగే హీరోలు సైతం తమ సినిమాలకు ఓటిటి బిజినెస్ ఎంత అవుతుందో తెలుసుకుని అందుకు తగ్గట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలా ఇప్పుడు అజిత్ తాజా చిత్రానికి సైతం ఓటిటి బిజినెస్ పూర్తైంది. అయితే మైండ్ బ్లాక్ అయ్యే రేటుకు ఈ సినిమా రైట్స్ వెళ్లాయని వినికిడి. ఆ వివరాలు చూద్దాం.

తమిళ స్టార్  అజిత్ కుమార్‌తో (Ajith kumar) మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ (Adhik ravichandran) రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే హైదరాబాద్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. టైటిల్ కి తగ్గట్టు అజిత్ ని మూడు డిఫరెంట్ వేరియేషన్స్ లో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ లో వైబ్రెంట్ అవుట్ ఫిట్స్, చేతినిండా టాటూస్, షేడ్స్ ధరించి ఎదురుగా వున్న వెపన్స్ తో అమేజింగ్ గా కనిపించారు అజిత్. ఈ ఒక్క ఫస్ట్ లుక్ తోనే సినిమా ఓటిటి బిజినెస్ పూర్తైందని తెలుస్తోంది.

తమిళ ఫిల్మ్ సర్కిల్స్‌ ప్రకారం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.95 కోట్లకి అమ్ముడయ్యాయని సమాచారం. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ యాక్షన్ డ్రామా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా ఈ న్యూస్ మాత్రం ఫ్యాన్స్‌ను కూడా షాకయ్యేలా చేస్తుంది. ఎందుకంటే అజిత్ సినిమా ఓటీటీ రైట్స్‌కి ఈ రేంజ్‌లో రావడం ఇదే తొలిసారి.
  
ఫస్ట్ లుక్  పోస్టర్ లో మూడు లుక్స్ లో మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో మెస్మరైజ్ చేశారు. సినిమాపై చాలా క్యూరియాసిటీ పెంచిన ఈ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అభినందన్ రామానుజం డీవోపీగా పని చేస్తుండడగా, విజయ్ వేలుకుట్టి ఎడిటర్ గా పని చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.
 

click me!