Latest Videos

ఐపీఎల్ హిస్ట‌రీలో ఒకేఒక్క‌డు కింగ్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

By Mahesh RajamoniFirst Published May 22, 2024, 9:35 PM IST
Highlights

RCB vs RR : ఐపీఎల్ 2024 ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ 8000 ప‌రుగులు పూర్తి చేసి స‌రికొత్త రికార్డు సృష్టించాడు.
 

IPL 2024 Virat Kohli : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో సంజూ శాంస‌న్ నాయ‌క‌త్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగ‌ళూరు ఇన్నింగ్స్ ను కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీలు ప్రారంభించారు. ఈ సీజ‌న్ లో ప‌రుగులు వ‌ర‌ద పారిస్తున్న విరాట్ కోహ్లీ మ‌రో ఘ‌త‌న సాధించాడు. ఐపీఎల్ లో 8000 ప‌రుగులు పూర్తి చేసిన తొలి ప్లేయ‌ర్ గా నిలిచాడు. దీంతో ఐపీఎల్ హిస్ట‌రీలో ఒకే ఒక్క ప్లేయ‌ర్ గా 8000 ప‌రుగులు సాధించిన  ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

కింగ్ కోహ్లీ 32 ప‌రుగులు వ‌ద్ద ఈ రికార్డును అందుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి ఫోర్ కొట్టి ఐపీఎల్‌లో ఎనిమిది వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఈ క్ర‌మంలోనే యుజ్వేంద్ర చాహల్ వేసిన బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో 24 బంతుల్లో 33 పరుగుల వ‌ద్ద కోహ్లీ  ఔట్ అయ్యాడు.

రోవ్‌మన్ పావెల్ సూప‌ర్ మ్యాన్ షో.. ఐపీఎల్ హిస్ట‌రీలో మ‌రో బెస్ట్ క్యాచ్.. వీడియో

ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరే.. 

విరాట్ కోహ్లీ- 8004 (244 ఇన్నింగ్స్)
శిఖర్ ధావన్- 6769 (221 ఇన్నింగ్స్)
రోహిత్ శర్మ- 6628 (252 ఇన్నింగ్స్)
డేవిడ్ వార్నర్- 6565 (184 ఇన్నింగ్స్)
సురేష్ రైనా- 5528 (200 ఇన్నింగ్స్)

ఒక సీజన్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆర్సీబీ ప్లేయ‌ర్లు

విరాట్ కోహ్లీ- 973 (2016)
విరాట్ కోహ్లీ- 741* (2024)
క్రిస్ గేల్- 733 (2012)
ఫాఫ్ డుప్లెసిస్ - 730 (2023)
క్రిస్ గేల్- 708 (2013)

విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు.. పోలీసులు అల‌ర్ట్..

click me!