Latest Videos

రామ్ చరణ్ పై ఉపాసన ఆసక్తికర కామెంట్స్... ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ 

By Sambi ReddyFirst Published May 22, 2024, 8:01 PM IST
Highlights


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది భార్య ఉపాసన. విదేశాలకు వెళ్లిన ఉపాసన ఇంస్టాగ్రామ్ వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 


రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ లవ్లీ కపుల్ అనడంలో సందేహం లేదు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట అన్యోన్య దంపతులు అనిపించుకుంటున్నారు. వివాహం జరిగిన పదేళ్లకు కూడా ఉపాసన తల్లి కాలేదు. ఈ క్రమంలో అనేక విమర్శలు తలెత్తాయి. అయినప్పటికీ ఉపాసన మాట మీద కట్టుబడి ఉంది. పదేళ్ల తర్వాతే పిల్లలు అని రామ్ చరణ్, ఉపాసన ఫిక్స్ అయ్యారట. ఆ ఒప్పందానికి కట్టుబడి ఆలస్యంగా పిల్లలను కన్నారు. 

ఉపాసన గర్భం దాల్చినట్లు చిరంజీవి 2022 డిసెంబర్ లో తెలియజేశాడు. జూన్ 20న ఉపాసన అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డను కన్నది. ఉపాసన-రామ్ చరణ్ కూతురు పేరు క్లిన్ కార. లలితా సహస్ర నామం నుండి ఈ పేరు పెట్టినట్లు చిరంజీవి వెల్లడించారు. క్లిన్ కార పుట్టాక మెగా ఫ్యామిలీలో అనేక శుభ శకునాలు చోటు చేసుకున్నాయి. 

ఇదిలా ఉంటే ఉపాసనకు రామ్ చరణ్ ప్రతి విషయంలో మద్దతుగా ఉంటారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. చరణ్ నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నాకు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటున్నావు. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఉపాసన కామెంట్ చేసింది. ఉపాసన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. 

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు శంకర్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ ప్రకటించారు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. 
 

click me!