Latest Videos

స్టార్‌ హీరోలకు కాజల్‌ రేటింగ్‌.. ఎవరు బాగుంటారో చెప్పి షాకిచ్చిన చందమామ.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు?

By Aithagoni RajuFirst Published May 22, 2024, 2:35 PM IST
Highlights

కాజల్‌ త్వరలో `సత్యభామ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓల్డ్ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతుంది. ఇందులో స్టార్‌ హీరోలకు ఆమె రేటింగ్‌ ఇచ్చింది. 
 

కాజల్‌ అగర్వాల్‌ తెలుగు తెర అందాల చందమామగా ఓ వెలుగు వెలిగింది. స్టార్‌ హీరోలందరితోనూ ఓ రౌండ్‌ కలిసి నటించింది. చిరంజీవి, బాలయ్య వంటి సీనియర్‌ హీరోలకు కూడా జోడీ కట్టింది. హీరో ఎవరైనా తన పాత్రలో అలరిస్తుంది కాజల్‌. అయితే ఆమె ఎక్కువగా పక్కింటి అమ్మాయి పాత్రల్లోనే మెరిసింది. మూడు సీన్లు, ఆరు పాటలు ఉండే సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. కమర్షియల్‌ సినిమాలు ఎక్కువగా చేసింది. 

కాజల్‌ అగర్వాల్‌ హీరోలకు రేటింగ్‌ ఇచ్చింది. తాను పనిచేసిన హీరోల్లో లుక్స్ కి సంబంధించి ఎవరు బాగుంటారో తెలిపింది కాజల్‌. అలాగే వెండితెరపై ఏ హీరోతో నటిస్తే కంఫర్ట్ గా ఉంటుందో వెల్లడించింది. ఈ క్రమంలో ఆమె స్టార్‌ హీరోలకు షాకింగ్‌ రేటింగ్‌ ఇచ్చింది. ఒక్క హీరోకి మాత్రం ఎక్కువగా దక్కింది. మరి ఆ హీరో ఎవరు? ఎవరికి తక్కువ రేటింగ్‌ ఇచ్చిందనేది చూస్తే.. 

కాజల్‌.. ప్రభాస్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, బన్నీ, రామ్‌ చరణ్‌, రామ్‌, కళ్యాణ్‌ రామ్‌ వంటి హీరోలతో కలిసి నటించిన విషయం తెలిసిందే. లుక్స్ పరంగా ప్రభాస్ కి ఎక్కువ మార్కులు ఇచ్చింది కాజల్‌. పదికి 8 రేటింగ్‌ ఇస్తే, రామ్‌ చరణ్‌, రామ్‌లకు ఏడు రేటింగ్‌ ఇచ్చింది కాజల్‌. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ లకు ఆరు రేటింగ్‌ ఇచ్చింది. ఇక తక్కువగా కళ్యాణ్‌ రామ్‌కి ఇచ్చింది. ఆయనకు కేవలం 5 మార్కులే వేసింది. 

మొత్తంగా ఇందులో పదికి 8 మార్కులతో ప్రభాస్‌ లుక్‌ బాగుంటుందని చెప్పింది. ఇక కెమిస్ట్రీ విషయంలో మాత్రం ఎన్టీఆర్‌, ప్రభాస్, రామ్‌చరణ్‌లతో బాగా ఉంటుందని చెప్పిన సత్యభామ.. వీరిలో రామ్‌చరణ్‌తో కెమిస్ట్రీ బాగుంటుందని అంతా అంటుంటారని చెప్పింది. ఇక తనని ఎలా పిలస్తే బాగుంటుందనే ప్రశ్నకి, కాజల్‌లాగే పిలిస్తే నచ్చుతుందని చెప్పింది. పాత ఇంటర్వ్యూలోని ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. చూడబోతుంటే ఇప్పుడిది స్టార్‌ హీరోల అభిమానుల మధ్య చిచ్చుపెట్టేలా ఉంది.  మరి దీనిపై ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే ఇందులో మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌ ల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. 

Gives Rating to Heroes looks - 6 out of 10 6 out of 10 8 out of 10 -7 Out of 10 - 7 Out of 10 - 5 out of 10 pic.twitter.com/CL7JBuhMjN

— Filmy Bowl (@FilmyBowl)

ఇక కాజల్‌ ప్రస్తుతం `సత్యభామ` అనే చిత్రంలో నటిస్తుంది. ఆమె నటిస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ఇది. ఈ నెల 31న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమెకి సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్‌ కావడం గమనార్హం. ఇక `సత్యభామ` చిత్రంలో నవీన్‌ చంద్ర కాజల్‌కి జోడీగా కనిపించనున్నారు. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి దర్శకుడు శశి కిరణ్‌ తిక్క రైటర్‌గా, నిర్మాతగా, బ్యాక్‌ బోన్‌గా నిలబడ్డారు. 
 

click me!